బుధవారం, జూలై 17, 2024
Homeఅంతర్జాతీయంభారత్ దెబ్బకు తప్పు సరిదిద్దుకునే పనిలో చైనా..!

భారత్ దెబ్బకు తప్పు సరిదిద్దుకునే పనిలో చైనా..!

చైనా భారత్ కు పంపిన 5 లక్షల కిట్లకు ఎలాంటి సొమ్ము చెల్లించం’ చైనా కంపెనీలు గ్యాంగ్ ఝౌ వాండ్ఫో బయోటెక్, ఝుహై లివ్జన్ డయాగ్నోస్టిక్స్ సరఫరా చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఐసీఎంఆర్ సూచించింది. చైనా సరఫరా చేసిన కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తుండటం వల్ల వాటిని వినియోగించరాదని ఐసీఎంఆర్ నిర్ణయించింది.

చైనా కంపెనీలు గ్యాంగ్ ఝౌవాండ్ఫో బయోటెక్, ఝుహై లివ్జన్ డయాగ్నోస్టిక్స్ సరఫరా చేసిన  కొవిడ్-19 కిట్లపై ఐసీఎంఆర్ నిషేధం విధించింది. కేంద్రం  నిర్ణయం పై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొంతమంది కావాలనే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని భారత్​లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్ తెలిపారు.

దీని పై చైనా ప్రతినిధులు భారత్ ని జోకొట్టే పనిలో పడ్డారు కొవిడ్-19 కిట్లపై నిషేధం విధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. భారత్ సహేతుకంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘చైనా ఉత్పత్తులు ఎంతో నాణ్యతతో కూడుకున్నవి. వీటిపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధ్యరాహిత్యం అని అంటోంది. అయితే కరోనాపై అందరం కలిసిపోరాడాలని త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని అంటోంది చైనా.

పైగా ఆ కంపెనీల నుంచే ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకూ కిట్లు సరఫరా అయ్యాయని.. అయితే వాటికి మంచి గుర్తింపు లభించిందని జీ రోంగ్ తెలిపారు.  సుమారు రెండు వారాల క్రితం చైనాకు చెందిన రెండు కంపెనీలు భారత్ కు 5 లక్షల కిట్లను సరఫరా చేశాయి. అయితే ఈ కిట్లకు సంబంధించి తాము ఎలాంటి సొమ్ము చెల్లించమని ఐసీఎంఆర్ పేర్కొంది దింతో చైనా స్పందించింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular