మంగళవారం, మార్చి 19, 2024
Homeఅంతర్జాతీయంచైనా తగ్గింది.. తాటాకు చప్పుళ్లకు భారత్ భయపడదు

చైనా తగ్గింది.. తాటాకు చప్పుళ్లకు భారత్ భయపడదు

మొన్నటివరకూ  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే భారత్​- చైనాలు సరిహద్దు వద్ద నెలకొన్న  వివాదాన్ని ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకుగాను రెండు దేశాలూ  ఓ అంగీకారానికి వచ్చాయని భారత విదేశాంగశాఖ ఈ విషయాన్ని  వెల్లడించింది .

భారత్​ మరియు చైనా మధ్య సైనిక చర్యలు స్నేహపూర్వక, శాంతియుత వాతావరణంలో జరిగాయని వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరియు  సరిహద్దుల వెంట శాంతి నెలకొనడం అవసరమని విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

బోర్డర్ లో యుద్ధ ప్రాతిపదికన సైన్యాన్ని మోహరించడం మరియు తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో నెలరోజులకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలను  తగ్గించడమే లక్ష్యంగా భారత్-చైనా సైనికాధికారులు శనివారం సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి.. చైనాకు చెందిన చుషుల్ సెక్టార్​లోని మాల్డోలో ఈ సమావేశం ఏర్పాటైంది.

మన భారతదేశం‌ తరఫున లేహ్‌లోని 14 కార్ప్స్‌ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ “హరిందర్ సింగ్”, చైనా తరఫున టిబెట్‌ సైనిక జిల్లా కమాండర్‌ “లూ లెన్‌” ఈ చర్చల్లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనలు, ఉద్రిక్తతల నివారణకు లెఫ్టినెంట్ల స్థాయిలో చర్చలు జరగటం ఇదే తొలిసారి. దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు

“ఈ ఏడాదితో భారత్​ మరియు చైనాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఇప్పటికి 70 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకూ కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూనే… ఇరుదేశాల బంధం మరింత అభివృద్ధి చెందాలని భారత్​, చైనా ఆకాంక్షిస్తున్నాయి.” – భారత విదేశాంగశాఖ సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం కోసం ఇరుపక్షాలు సైనిక, దౌత్యపరమైన చర్యలు కొనసాగిస్తాయని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular