ఆదివారం, నవంబర్ 27, 2022
Homeజాతీయంఏపీ లో ఇక చికెన్ కొనలేరు...!

ఏపీ లో ఇక చికెన్ కొనలేరు…!

ఏపీ లో రోజురోజుకీ పెరుగుతున్న చికెన్ ధరలు చూసి సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటేనే బయపడుతున్నారు. తణుకు, అత్తిలి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఈస్ట్ గోదావరిలో చాలా చోట్ల కోళ్ళకు వైరస్ రావడం మరియు కరోనా వైరస్ ప్రభావంతో జనం కూడా చికెన్ కి దూరంగా ఉండడంతో నెల క్రితం కేజీ 20 రూపాయలకు కూడా కొనని పరిస్థితిలో కోళ్ళ ఫారం యజమానులు వాటిని రోడ్ల పక్కనే పాడేసిన పరిస్థితి నెలకొంది. అయితే క్రమేనా పెరుగుతూ ఇది 200 చేరుకుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ లో కూరగాయల రెట్లు ఆకాసాన్నంటడంతో జనం చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో మద్యం విక్రయాలు భారీగా పెరగటంతో మందు బాబులు కూడా చికెన్ తెగ కొనేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో చికెన్ కు డిమాండ్ పెరగడం కోళ్ళ సప్లయ్ తక్కువగా ఉండడంతో చికెన్ ధర 300 పైనే దాటేసింది. ఇక కోడిగుడ్ల ధరలు కూడా భారీగానే పెరిగాయి నెల క్రితం 1.80రూ. ఉన్న కోడిగుడ్లు ప్రస్తుతం నాలుగు రూపాయలకి చేరింది.

RELATED ARTICLES

Most Popular