ఛార్మి ఒకానొకప్పుడు కుర్రాళ్లను తన అందంతో కుదిపేసిన బ్యూటీ అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న సమయంలో తనకు తోడు ఇదేనంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఛార్మి. లాక్ డౌన్ పై సెలబ్రేటిస్ ఛాలెంజస్ తో సోషల్ మీడియాలో అభిమానులకి సందేశంతో పాటూ ఎంటర్ టైన్మెంట్ కూడా ఇస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ట్వీట్ చేసిన నటి-నిర్మాత ఛార్మి.. తన క్వారంటైన్ పార్టనర్ ఇదేనని రాసుకొచ్చింది. ఇందులో భాగంగా తన పెంపుడు కుక్కతో కలిసున్న ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఛార్మి విజయ్ దేవరకొండ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఎన్నో హిట్ సినిమాలు చేసి వైవిధ్యమైన పాత్రల్లో అటు గ్లామర్ ఇటు యాక్షన్ మూవీస్ లో కూడా తన మార్క్ వేసిన ఛార్మి గత కొన్నేళ్ల నుంచి నటనకు బ్రేక్ ఇచ్చింది అయితే ఈ గ్యాప్ లో నిర్మాతగా మారింది.
పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ భాగస్వామిగా సినిమాలు నిర్మిస్తోంది ఛార్మి. ఇష్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తరువాత విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.