Thursday, November 26, 2020
Home రాజకీయం అధికారంలో లోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం..చంద్రబాబు

అధికారంలో లోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం..చంద్రబాబు

దశాబ్దాలుగా టిడిపిలో పదవులు పొందిన సీనియర్ నాయకులు వేధింపులకు భయపడి పార్టీ మారుతున్నారని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలోని టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు బెదిరింపులతో పార్టీ మారితే అది పిరికితనం అవుతుందని అన్నారు టిడిపిలో ఒకరు పోతే 100 మందిని తయారు చేయగల సత్తా తమకుందని అన్నారు.

ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయిన పార్టీకి జరిగే నష్టమేమీ ఉండదన్నారు. పార్టీ మారిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాబోయే 40 ఏళ్లకు దీటైన నాయకులను తయారుచేసే సత్తా తనకు ఉందన్నారు. టిడిపి పార్టీ ప్రజా సమస్యలపై ఇకపై గేరు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ఇంతా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామన్నారు.

Most Popular