గురువారం, మార్చి 28, 2024
Homeజాతీయంబ్రేకింగ్... కేంద్రం సీరియస్ ఇకనుంచి వాళ్లకు నాన్ బెయిలబుల్ వారెంట్

బ్రేకింగ్… కేంద్రం సీరియస్ ఇకనుంచి వాళ్లకు నాన్ బెయిలబుల్ వారెంట్

 

కరోనా ధాటికి ప్రపంచం కకావికలం అయిపోతోంది. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని దేశాల్లో అయితే అసలు చికిత్స చేయడానికి ఆసుపత్రులు లేక జనం మృత్యుఒడిలోకి వెళ్లిపోతున్న పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా దెబ్బకి విలవిలలాడిపోయింది. కుప్పలుగా పేరుకుపోయిన కోవిడ్ – 19 కేసులు రాసులుగా శవాల కుప్పలు అక్కడ ప్రస్తుతం ఇలాగే ఉంది.

ఇటు భారత్ లో కూడా కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ నడుస్తున్నా కేసుల నమోదు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. కొన్ని ప్రాంతాల్లో కరోనా అంచనాలకు కూడా అందటంలేదు ఒకరోజు పది కేసులు నమోదవుతుంటే మరొకరోజు 50 నుంచి 60 కేసులు నమోదు అవుతున్నాయి.

పోలీసులు పకడ్బంధిగా జనం రోడ్లపైకి రాకుండా పహారా కాస్తున్నారు. డాక్టర్స్ రాత్రీపగలూ అంటూ తేడా లేకుండా వైద్యం అందిస్తున్నారు అయితే కొన్నిచోట్ల వైద్యులపై కొంతమంది రోగులు దాడులు చేస్తున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.  ఇకనుంచి ఎవరైనా డాక్టర్స్ పై దాడికి పాల్పడినా, దాడి చేసే వాళ్లకి సహకరించినా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయ్యాలని ఆదేశించారు.

దీనికై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. దాడులు చేసినవారికి 50 వేలనుంచి 2 లక్షలవరకు జరిమానాతో పాటూ మూడునెలల నుంచి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. దీనికి సంబందించిన పూర్తీ ఆర్డినెన్స్ ను త్వరలో తీసుకురానున్నట్టు ప్రకాష్ జావడేకర్ తెలిపారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular