pm kisan samman nidhi yojana లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు కుప్పకూలాయి ఇక రైతులు కూడా డీలాపడ్డారు.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతన్నలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా ఆలోచిస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రతీ రైతు ఖాతాలో కేంద్రం కిసాన్ సమృద్ధి యోజన స్కిం కింద 2000 రూపాయలు జమ చేసింది.
తెలంగాణాలో కిసాన్ సమృద్ధి యోజన పథకం కింద 34.70 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి అందిన ఈ సాయం రైతులకు చాలా ఉపయోగపడుతుందని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.