కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. కోవిడ్ పరీక్షలు ఎవరెవరికి చెయ్యాలంటే ..?

0
154
central government new guidelines for corona
central government new guidelines for corona

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాలా ప్రమాదకరంగా విజృంభిస్తున్న నేపద్యంలో  వైరస్ సోకిన వాళ్ళు ఎవరనేది తెలుసుకోవడానికి మనకు  ఉన్న ఏకైక మార్గం అలాగే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తక్కువ సమయంలో ఎక్కువ శాతం కరోనా పరీక్షలు చేయడం ప్రస్తుతం ఇవి మన ప్రభుత్వాల ముందున్న సవాళ్లు ఈ రెండే.

అయితే ప్రస్తుతం అధిక జనాభా కలిగిన మనలాంటి దేశంలో ఒకేసారి అందరికీ  కరోనా పరీక్షలు చెయ్యడం అనేది జరగని మరియు సాధ్యపడని విషయమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక  కఠిన చర్యలతో పాటు కొన్ని మార్గదర్శకాలు  తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా  మనదేశంలో ఒక్కసారిగా పెరుగుతున్న కేసులను ఎలా నివారించాలి అనేదానిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో పెరుగుతున్న  కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని నేడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

1. చివరి  పద్నాలుగు  రోజుల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా టెస్టులు

2. కరోనా సోకిన వారితో ఎక్కువగా  కాంటాక్ట్ లో ఉన్నవారికి సైతం టెస్టులు.

3. కరోనా నివారణకు కరోనా సోకినా వ్యక్తులకు వైద్యం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఫ్రంట్ లైన్‌ వర్కర్లులకు

4. తీవ్ర స్థాయిలో శ్వాసకోశ సంబందిత వ్యాధులతో బాధపడుతున్న వారికి

5. కరోనా సోకినా బాధితులకు ఎక్కువగా వారితో సన్నిహితంగా ఉన్న వారికి 5 మరియు 10వ రోజున

6. ప్రభుత్వం ప్రకటించిన హాట్‌స్పాట్‌లు మరియు కంటైన్‌మెంట్ జోన్లలో తీవరంగా అస్వస్థతకు గురైన వారికి

7. అనేక కారణాలతో అనారోగ్యం బారిన పడిన వలస కూలీలకు ఏడు రోజులు దాటకుండా పరీక్షలు చేయాలి.

పేర్కొన్న అన్ని  మార్గ దర్శకాలనూ పాటిస్తూ కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించడంలో ఎలాంటి  జాప్యం జరగకుండా చూడాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు  సూచించింది. ప్రస్తుతం భారత్‌లోకరోనా సోకినా బాధితుల సంఖ్య 103446 కు చేరింది. వీరిలో 3,303 మంది కరోనాతో మరణించారు.