Thursday, September 17, 2020
Home రాజకీయం కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి.. buggana rajendranath

కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి.. buggana rajendranath

ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కరోనాతో కలసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలని మంత్రి Buggana Rajendranath అన్నారు. సుధీర్ఘ కాలం లాక్ డౌన్ మనకు అంత మంచిది కాదు. ఈ యుధ్దంలో నూరుశాతం అందరూ విజయం సాదించాలన్నారు buggana. ఇప్పుడున్న కేసులు సున్నాకు వచ్చేవరకూ వ్యవస్ధను తెరవకపోతే ఇబ్బంది తప్పదన్నారు.తాను చెప్పే మాటలు  ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి, మాజి ఆర్ బి ఐ గవర్నర్ రఘురామరాజన్ లాంటి వాళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలని మీడియా సమావేశంలో తెలిపారు. సిబిఐ మాజి జేడి లక్ష్మీనారాయణగారు కూడా కరోనా గురించి సీఎం జగన్ గారు చెప్పింది నిజం అని తెలిపారు. కరోనాతో సహజీవనం తప్పదని డబ్య్లు హెచ్ ఓ నే చెబుతోందన్నారు. కొన్నాళ్ళకు మాస్కులు మన జీవితంలో భాగం కాబోతున్నాయి అని ప్రధాని నరేంద్రమోడి గారు అన్నారని ఇవన్నీ కూడా రాబోయే కాలంలో కరోనాతో కలసి మనం ఎలా జీవించాలో అని పలువురు ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలుగా తెలిపారు

చంద్రబాబు నాయుడు గారు  గత నెలరోజులుగా  పక్క రాష్ట్రం లో కూర్చుని  జూమ్ యాప్ లలో మాట్లాడుతూ తన కుమారుడు లోకేష్ ద్వారా ట్వీట్లు పెట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఫీల్డ్ లో లేని టిడిపి మాజీమంత్రులు, టిడిపి నేతల ద్వారా రకరకాలుగా  కేవలం మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఈ ఆపదసమయంలో కూడా టిడిపి నుంచి నేతలెవ్వరూ కూడా ప్రజలను ఆదుకోవడం మరియు సేవాకార్యక్రమాల వంటివి చేయట్లేదన్నారు. అలా చేసినట్లు నాకైతే కనబడలేదు.  ప్రజలకు ధైర్యం ఇవ్వాలి కాని టీడిపి నేతలుమాత్రం మీరు తప్పు దీనిని  సరైన రీతిలో గుర్తించలేదని పలు మార్లు రకరకాలుగా ఎవరెవరి ఆలోచనలకొద్దీ వాళ్లు మాట్లాడుతున్నారన్నారు.

మేము చేస్తున్న పనులు కనబడకుండా ఉండేదుకు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల శాతం 4.12 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాజిటివ్ కేసుల శాతం 1.4  గా ఉందన్నారు. కొన్ని రాష్ట్రాలలో తక్కువ టెస్ట్ లు చేసి వాటిని  శాతం తీసుకుని పాజిటివ్ శాతం తక్కువగా చూపిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఏపిలో ఇంత పెద్దసంఖ్యలో టెస్ట్ లు చేసినా కూడా పాజిటివ్ శాతం చాలా తక్కువగా ఉంది. కొందరు మీడియాలో కూడా తమపై తప్పుడు  వైఖరి అనుసరిస్తూ వేరే రాష్ట్రాలలో తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. చనిపోయేవారి విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా నేడు 6.88 వస్తే భారతదేశంలో 3.17గా ఉంది. అదే ఏపిలో మాత్రం 2.4గా ఉంది. అంటే ఇక్కడ పాజిటివ్ వచ్చిన వారికి సరైన క్రమంలో  వైద్యసౌకర్యాలు అందుతున్నాయి కాబట్టె తక్కువ మరణాల సంఖ్య ఉందనేది అర్దం చేసుకోవాలని అన్నారు. రిస్క్ ఉన్న జిల్లాలలో సైతం ప్రణాళికా బద్దంగా డివైడ్ చేయడం జరిగిందని అన్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుగారికి ఎప్పుడూ కూడా స్ధిరమైన ఆలోచన ఉండదన్నారు. ఆయన ఎదో ఒక  అయోమయంలో ఉంటారని వ్యాఖ్యానించారు. అంతేకాక తెలుగుదేశం పార్టీ సిధ్దాంతం కూడా అదే విధంగా ఉంటుంది. ఫలించని అంశాలను చాలా విలువైనవిగా వారు భావించి వారి జీవితాలను బాధాకరంగా చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఐదుకోట్ల 34 లక్షల జనాభా ఉంది. కరోనా కు సంబంధించి  1,02,460 పరీక్షలు చేశామన్నారు. ప్రతి పదిలక్షలమందిలో 1919 పరీక్షలు చేశామన్నారు. ఇది భారతదేశంలో అత్యంత ఎక్కువన్నారు తర్వాత ప్రతి పదిలక్షల మందిలో తమిళనాడు 1534 టెస్ట్ లతో రెండోస్దానంలో ఉందని తెలియజేశారు. ఇక  రాజస్దాన్ 1,344 టెస్ట్ లు , మహారాష్ర్ట 1,086 , గుజరాత్ 984  టెస్టులు చేస్తూ ఉన్నాయి. ఇన్ని పరీక్షలు చేయాలంటే ఎంతో చిత్తశుధ్దితో రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు  నెలరోజులలోపున  ఎన్నిమిషన్లు తెచ్చిఉంటారు. ఎన్ని టెస్టింగ్ ఫెసిలిటీస్ తయారుచేసి ఉంటారు. ఎంతమంది టెక్నీషియన్లను ట్రైన్ చేసి ఉంటారు. అలా చేస్తేనే ఇది సాధ్యమైందన్నారు.

హైరిస్క్ జిల్లాలుగా కృష్ణా, గుంటూరు, కర్నూలు ఉన్నాయన్నారు. ఈ జిల్లాలలో కేసులు ఎక్కువగా ఉండటానికి ప్రత్యేకకారణాలు ఉన్నాయి. ఇది అందరికి తెలిసిందే కర్నూలులో పాజిటివ్ రేటు 4.8 గా ఉంది. గుంటూరులో 3.03గాను కృష్ణాలో 3.24 గా ఉంది. తక్కువ రిస్క్ ఉన్న జిల్లాల్లో మొదటిగా తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం ఉన్నాయి. ఈరోజు గత 24 గంటల్లో 60 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఏపి గర్వంగా చెబుతోంది ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం ఎక్కువమందిని గుర్తిస్తున్నాం. ఎక్కువ మందిని గుర్తించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో ఉందనేది అర్దమవుతుందన్నారు.

 

Leave a Reply

Most Popular