శుక్రవారం, మార్చి 29, 2024
Homeభక్తికేదార్ నాథ్ లో కనువిందు చేస్తున్న బ్రహ్మకమలం

కేదార్ నాథ్ లో కనువిందు చేస్తున్న బ్రహ్మకమలం

కేదార్ నాథ్ మరియు బదరీనాథ్ మందిరాలకి కొంచం  పైన మంచు విరివిగా ఉండే ప్రదేశం ఉంటుంది. అక్కడ ఎటుచూసినా ముత్యంలా మంచు కప్పి ఉండే ఆ ప్రాంతంలో చాలా లోయాలుంటాయి ఆ లోయల్లో పూచే  బ్రహ్మకమలాలు చాలా అరుదు అంతే కాక అవి అపురూపం కూడా అవి కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూలు పూసి చూపరులను కనువిందు చేస్తాయి. అయితే ఈ మధ్య వీటి పూత అంతగాలేదు కానీ ఈ ఏడాది అక్కడి సుందర  లోయల్లో బ్రహ్మ కమలాలు విరివిగా పూసాయి వీటి పూతతో లోయలకు మరింత అందం వచ్చి చేరింది.

శ్రావణ , భాద్రపద మాసాలలో ఈ బ్రహ్మ కమలాలను  కోసుకుని వస్తూ ఉంటారు. అయితే నేడు కరోనా లాక్ డౌన్  కారణంగా వాతావరణ కాలుష్యం పెద్దగా లేకపోవడంతో  మంచుకొండల్లో బ్రహ్మకమలాలు సుందరంగా విరబూసాయి. ఈ స్థాయిలో బ్రహ్మకమలాలు విరబూయడం ఇంతకు మునుపెన్నడూ ఇక్కడ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. సంవత్సరానికి ఒక సారి మాత్రమె పూసే ఈ పూలు ఎంతో ప్రత్యేకమైనవి. చుట్టు మంచు మధ్యలో ఉండే ఈ చెట్లు విరబూసి అక్కడికి వచ్చిన యాత్రికులను మరియు చూపరులను కనువిందు చేస్తున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular