లిప్ కిస్ పెడితే ఇక అంతే సంగతులు…షాకింగ్ నిర్ణయం…!

0
175
Bollywood Kissing Scenes Images
Bollywood Kissing Scenes Images

Tollywood News కరోనా మహమ్మారి కారణంగా టాలివుడ్, బాలివుడ్ అనే తేడాలేకుండా ప్రతీ చోటా సినిమా షూటింగ్ లు మరియు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు మొత్తం ఎక్కడికక్కడే ఆగిపోయిన పరిస్థితి. అయితే ఇప్పటిదాకా బాలివుడ్ ఇండస్ట్రీ లో సుమారు ప్రతీ సినిమాకి ముద్దు సీన్లు హద్దులు దాటుతున్నాయి.  ప్రతీ సినిమాకు ఇవి లేకుండా సినిమా హిట్ అవ్వదేమో అన్నట్లుగా తయారయ్యింది ఇండస్ట్రీ. చూసే జనానికి కూడా ఇది కామన్ అయిపోయింది.

అయితే  ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బాలివుడ్ ఇండస్ట్రీ ఇకపై సంవత్సరం పాటు బాలివుడ్ సినిమాలలో ముద్దు సీన్లను బ్యాన్ చేస్తుందనే వార్తలు బాలివుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే తైవాన్, అమెరికా వంటి దేశాల్లో కొన్ని రోజులక్రితం షూటింగ్స్ లో అక్కడి ప్రభుత్వం  ముద్దు సీన్లను పూర్తిగా బంద్ చేసింది. లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కుదేలైంది. ఇలాంటి తరుణంలో ఈ నిర్ణయంతో నిర్మాతలకు ఇకపై  గడ్డుకాలమనే చేప్పాలి. అయితే వెబ్ సిరీస్ లలో సైతం ఈ నిబందన అమలు చేస్తారా లేదా అనేది త్వరలో తెలియనుంది.