Tuesday, August 4, 2020
Home సినిమా ప్రముఖ బాలివుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ బాలివుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (71)ఇకలేరు. గుండె పోటుతో శుక్రవారం తెల్లవారజామున కన్నుమూశారు. 15 రోజుల క్రితం అనారోగ్యానికి గురైనా కారణంగా జూన్ 20 నీ ముంబయి లోని బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న సరోజ్ ఖాన్ కు డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు నెగిటివ్ అని తేలింది. ICU లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

క్వీన్ ఆఫ్ ది డాన్సింగ్:

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గానే కాకుండా భారతీయ భాషల్లో అనేక చిత్రాలను డాన్స్ డైరెక్టర్ గా నిర్వహించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 3 సార్లు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ లు సొంతం చేసుకున్నారు. 4 శతాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న సరోజ్ ఖాన్ దాదాపు 2 వేలకు పైగా పాటలకు కొరియోగ్రాఫీ చేశారు. ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి ఆమె పని చేసారు.

మదర్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్ :

ప్రముఖ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ టాలీవుడ్ స్టార్స్ తో కూడా పని చేశారు.  చిరంజీవి ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘చూడాలని  ఉంది’  చిత్రం లోని మరియు “ఓ మారియా ఓ మారియా” అనే సాంగ్ కు సరోజ్ ఖాన్ అద్భుతమైన కొరియోగ్రాఫీ అందించారు. ఆ సాంగ్ లో చిరంజీవి సౌందర్య వేసిన స్టెప్స్ కి అప్పట్లో ఫాన్స్ నీ బాగా అకట్టుకున్నాయి. చిరంజీవి సినిమా అనగానే ఆవిడ బాలీవుడ్ సినిమాలు కూడా వదిలేసి వచ్చేవారు అంటూ ఎమోషనల్ అయ్యారు గుణశేఖర్. సినీ ఇండస్ట్రీలో  పలు టాలీవుడ్ నటులు ఆమెకు సంతాపం తెలిపారు. అల్లు అర్జున్ సరోజ్ ఖాన్ మరణ వార్తపై స్పందిస్తూ.. స‌రోజ్ ఖాన్‌తో కలిసి ‘డాడీ’ సినిమా కోసం పని చేసిన అనుభవాలను అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నారు.

‘సరోజ్ గారు! దిగ్గజ కొరియోగ్రాఫర్ ఇక లేరు. ఆమె నా తొలి కొరియోగ్రాఫర్. ‘డాడీ’ సినిమా కోసం ఆమెతో కలిసి పనిచేశా. ఆమె అద్భుతమైన పనితనానికి నేనెప్పుడూ అభిమానినే. ఇండియన్ సినిమాలో వెలకట్టలేని, భర్తీచేయలేని ఆభరణం ఆమె ఆమెకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నా ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అయితే ప్రముఖ బాలీవుడ్  కొరియోగ్రాఫర్లు సరోజ్ ఖాన్ కు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 2 వేల కు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసిన ఆమె ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్ వంటి వారు స్టార్ హీరోయిన్లు గా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2002లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన “దేవదాస్” చిత్రంలోని ‘డోలారే డోలా’,మాధురి దీక్షిత్‌కు ఏంతోగానో పేరు తెచ్చిన తేజాబ్‌లో ‘ఏక్ దో తీన్ సాంగ్’, 2007లో కరీనా కపూర్ నటించిన  జబ్ వుయ్ మెట్‌లో ‘యే ఇష్కీ హాయా’ పాటలకు జాతీయ పురస్కాలు దక్కాయి.  హవా హవాయి, చాందినీ, తమ్మా తమ్మా లోగే వంటి  సూపర్ హిట్స్  అందించిన కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.

Leave a Reply

Most Popular