Monday, October 26, 2020
Home జాతీయం తెలంగాణా లో తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ పైనే ప్రపంచ దేశాల ఆశలు

తెలంగాణా లో తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ పైనే ప్రపంచ దేశాల ఆశలు

రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను చూసి ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణా లోని భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ పైనే చాలామంది  ఆశలు పెట్టుకున్నారు. ఆ సంస్థ తయారు చేసిన  ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం తెలంగాణలో మొదలుపెట్టారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆరోగ్యవంతులైన వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ  నిమ్స్ లో నేటి నుంచి ప్రారంభమైంది.

ఆరోగ్యంగా ఉండి ట్రయల్స్‌ కు సమ్మతించిన వ్యక్తుల రక్త నమూనాలను నిమ్స్‌ సిబ్బంది సేకరించనున్నారు. ఆయా వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలపై వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేస్తారు వీటిలో వారు  ఆరోగ్యంగా ఉంటే వారం తర్వాత వారికి మొదటి డోస్‌ ఇస్తారు. ట్రయల్స్‌ లో భాగంగా ఒక్కో వ్యక్తికి మూడు డోసులు ఇస్తాం. మొదటి డోస్‌ ఇచ్చిన తర్వాత ఆస్పత్రిలోనే రెండ్రోజులు పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతామన్నారు.

14 రోజుల తర్వాత వారికి రెండో డోస్‌ ఇస్తామని నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ పై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. చైనా లో కూడా ఇదే ఫార్ములా తో వ్యాక్సిన్ తాయారు చేస్తున్నారని అయితే తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ దానికన్నా 10 రెట్లు ఎక్కవ రిజల్ట్స్ తీసుకువస్తుందన్నారు. కరోనా వ్యాక్సిన్ భారత్ కు చెందిన అడ్వాన్స్ టెక్నాలజీ తో ఇంత త్వరగా తీసుకురావడం గర్వించాల్సిన విషయమన్నారు.

Most Popular