ప్రస్తుతం ప్రభాస్ పేరు చెబితే ప్రపంచంలో తెలియని వారు ఉండరేమో అన్నంతగా ప్రభాస్ బాహుబలి సినిమాతో తన స్టామినా ఎలాంటిదో మొత్తం ప్రపంచానికి తెలియజేసాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా ఇమేజ్ ను ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్ళాడు.
తరువాత రిలీజ్ అయిన సాహో కూడా బాలివుడ్ ని షేక్ చేసి రికార్డు స్థాయి కలక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి టాలివుడ్ మరియు బాలివుడ్ నుండి తారలను తీసుకున్నారు.
అయితే కొన్ని రోజులుగా ప్రభాస్ సినిమాలో బాలివుడ్ బామ భాగ్యశ్రీ నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ తన సోషల్ మీడియా ద్వారా భాగ్యశ్రీ కి బర్త్ డే విషెస్ తెలపడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇక రంగంలోకి దిగగా ఈ వ్యవహారం భాగ్యశ్రీ తను ప్రభాస్ సినిమాలో చేస్తున్నట్లు అంగీకరించే వరకూ వచ్చింది.
అయితే ప్రస్తుతం భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తుందనే వార్త బయటికి రావడంతో ఫ్యాన్స్ మాత్రం తన రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం భాగ్యశ్రీ ప్రభాస్ కు సిస్టర్ గా నటిస్తుందనే వార్త వినిపిస్తుంది.

అయితే బాలివుడ్ లో 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా, త్యాగీ, పాయల్ వంటి అనేక చితాల్లో నటించింది, సల్మాన్ ఖాన్ తో నటించిన మేనేప్యార్ కియా తెలుగులో ప్రేమ పావురాలు గా రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాదించింది.
ఈ సినిమాతో బాగ్యశ్రీ కి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ రావడంతో టాలివుడ్ నిర్మాతలు సైతం ఆమెతో తెలుగులో సినిమాలు చేయించాలని చూసినా ఆమె మాత్రం బాలివుడ్ సినిమాలకు మాత్రమె పరిమితమయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా కావడంతో లీడ్ రోల్లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది.