శుక్రవారం, మార్చి 29, 2024
Homeహెల్త్ఈ అల్పాహారం తింటే చాలు రోజంతా చురుగ్గా..| high protein breakfast

ఈ అల్పాహారం తింటే చాలు రోజంతా చురుగ్గా..| high protein breakfast

మనం ప్రతీ రోజూ తీసుకునే ఆహారంలో అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చాలా ముఖ్యమని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు.

ప్రతిరోజు మనం అల్పాహారాన్ని మానకుండా తీసుకోవాలి అలా తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ ముఖ్యంగా మన ఎముకలకు చాలా మంచిది.

ప్రతీరోజూ మనం తీసుకునే ఆహారంలో న్యూట్రియంట్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.అంతేకాక ఎక్కువగా కాల్షియం కలిగి ఉన్న ఆహార పదార్దాల్ని తీసుకోవాలి వీటివల్ల మన ఎముకలు మరియు మీ పళ్ళు ఆరోగ్యంగా మరియు దృఢంగా మారతాయి.

High protein breakfast 

అసలు క్యాల్షియం ఏ ఆహారం లో ఉంటుందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి పాలు. పాలలో క్యాల్షియం కంటెంట్ అదికంగా ఉంటుంది. మన శరీరానికి క్యాల్షియం కంటెంట్ పెరగాలంటే ప్రతీ రోజూ ఒక పెద్ద గ్లాసుడు పాలు తాగడం చాలా మంచిది. అంతేకాక పండ్లలో కూడా కాల్షియం కంటెంట్ ఉంటుంది.

అయితే ఉదయం పూట పాలు తాగి సాయంత్రం పూట పండ్లు తిని కూడా మన బాడీ లో క్యాల్షియం సమతులంగా  పెంచుకోవచ్చు. ఫ్రూట్స్ లో ఆరెంజ్, బొప్పాయి, ఆప్రికాట్ మరియు కివి లను తింటూ ఉండండి. సాధ్యమైనంత వరకు మీ అల్పాహారంలో ఆకు కూరలను తీసుకోవాలి.

ఎప్పుడు పొరపాటున కూడా అల్పాహారాన్ని నిర్లక్షం  చేయడానికి ప్రయత్నించకూడదు. అల్పాహారం తోనే మన రోజు మొదలవ్వాలి. మనకు ఒక రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో  కావలసిన పోషక ఆహారాలు అన్నీ అందులోనే ఉండేలా జాగ్రత పడాలి.

అల్పాహారాన్ని స్కిప్ చేయకుండా పైన చెప్పినవన్నీ రోజూ  తీసుకుంటూ ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి పైన చెప్పినవన్నీ క్రమం తప్పకుండా తినటం మొదలు పెట్టండి. మీ ఆరోగ్యం లో మార్పులను గమనించండి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular