వేసవి దెబ్బకి హ్యూమన్ బాడీస్ డి హైడ్రేట్ అవుతాయి. చెమట రూపంలో శరీరంలో ఉన్న లవణాలన్నీ బయటకి పోవడంతో మనం నిస్సత్తువగా, నీరసంగా తయారవుతాం. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు ఒకవేళ ఎక్కువ నీళ్లు తాగినా భోజనం చెయ్యలేం. అందుకే వేసవిలో పుచ్చకాయని మనం రోజు తింటే మంచి ఫలితం ఉంటుంది దాంట్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం మన శరీరానికి గొప్ప శక్తిని ఇస్తాయి మనం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ని ఫిల్ చేస్తాయి.
వీటితో పాటు విటమిన్ సీ, ఎ, బి1, బి6 లాంటి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్స్ ని పుష్కలంగా శరీరానికి అందిస్తాయి. దింట్లో ఉండే లైకో పిన్ రక్త పోటును తగ్గిస్తుంది అంతేకాకుండా గుండెకూడా ఆరోగ్యంతో ఉంటుంది. పుచ్చకాయ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది దీనిలో పీచుపదార్థం కూడా అధికంగా ఉండటంవల్ల మలబద్దకానికి మంచి ఔషధంలా పనికొస్తుంది. ఇక పుచ్చకాయ తింటే ఆకలికూడా త్వరగా వెయ్యదు యాక్టివ్గా ఉంటాం సో శరీర బరువు కంట్రోల్ లో ఉంటుంది.
మెరిసే చర్మం మీసొంతం
పుచ్చకాయ తినేవాళ్ళల్లో జుట్టు, చర్మం చాలా గ్లోగా ఉంటాయి. దీనిలో ఉండే ఎ, సి విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి. మనం తినే మొత్తం పుచ్చకాయలో 90 శాతం పైగా నీరే ఉంటుంది దీనివల్ల మన శరీరం డీహైడ్రేట్ అవ్వదు శరీరానికి కావలసిన అన్ని లవణాలు అందుతాయి. అందుకే ఈ వేసవిలోనే కాదు ప్రతీ వేసవిలో మన ఆహారంలో పుచ్చకాయ భాగం చేసుకోగలిగితే ఆరోగ్యం చక్కగా చల్లగా ఉంటుందన్నమాట.
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడింది అనుకుంటే క్రింద ఉన్న లవ్ సింబల్ ఎమోజిని క్లిక్ చెయ్యండి.