టాలివుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలివుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే 2005 లో రెబల్ స్టార్ ప్రభాస్ ఛత్రపతి సినిమాతో ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. అంతేకాక ప్రభాస్ కు భారీ మాస్ ఫాలోవింగ్ తెచ్చిన సినిమా కూడా ఇదే.
అయితే ప్రస్తుతం Bellamkonda Srinivas ఛత్రపతి సినిమాను హిందీలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని ఫిలింనగర్ టాక్ ఈ సినిమా కోసం హిందీ భాష తెగ కుస్తీ పడుతున్నాడట మనవాడు. ప్రస్తుతం భాష పరంగా ఎలాగున్నా స్క్రీన్ ప్రేజెన్స్, లుక్, డైలాగ్స్ వంటి వాటిపై కసరత్తు చేస్తున్నాడట.
దీనికి కారణం ఈ సినిమా ఇప్పటికే ప్రభాస్ చేయడం.. ప్రభాస్ కు బాలివుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాలివుడ్ ప్రేక్సకులలో ప్రభాస్ సినిమాలలో లో బాగా నచ్చేది స్క్రీన్ ప్రెజెన్స్ అందుకే శ్రీనివాస్ ఈ విషయంపై ఫోకస్ చేస్తున్నాడనే వార్త వినిపిస్తున్నాయి.
అంతే కాక ఇది డబ్బింగ్ సినిమా కావడంతో ప్రేక్షకులు రెండు సినిమాలనూ కంపెరిజన్స్ చేసి మరీ చూస్తారు. సినిమా హిట్ అయితే సరే సరి ఏదైనా తేడా కొడితే నార్త్ ఇండియన్స్ ప్రేక్షకులు, క్రిటిక్స్ చేసే మేమ్స్ కి బలవ్వడం కాయం ఎందుకంటే దీనికి ఒక ఎక్జాంపుల్ రామ్ చరణ్ నటించిన జంజీర్ ఒక ఉదాహరణ.
అయితే ప్రస్తుతం టాలివుడ్ సినిమాలు చాలా వరకూ హిందీ లో డబ్ అయ్యి మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఇక Bellamkonda Srinivas విసయానికొస్తే మొదటి సినిమా నుండి ఇప్పటి వరకూ తనను తాను మార్చుకుంటూ టాలివుడ్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు.
కెరీర్ ప్రారంబంలో మూస పద్దతిలో మాస్ కేరెక్టర్ లు చేస్తూ దెబ్బలుతిన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తరువాత రాక్షసుడు, కవచం, సాక్ష్యం వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో సక్సెస్ సాదించడమేకాక విమర్శకుల నుండి కూడా ప్రసంసలు పొందాడు.
ఇక తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసే సినిమాలకు హిందీ యూట్యూబ్ ప్రేక్షకులలో Bellamkonda Srinivas కు ప్రత్యెక ఫ్యాన్ బేస్ ఉంది. జయ జానకి నాయక సినిమాకు 468 మిలియన్స్ వ్యూస్ తో బ్రహ్మరధం పట్టారు అలాగే కవచం 272 మిలియన్స్, సీత 350 మిలియన్స్ తో డబ్బింగ్ సినిమాలలో రారాజుగా బెల్లంకొండ నిలిచాడు.
ప్రస్తుతం టాలివుడ్ లో పెద్ద హీరోలకు కూడా ఇలాంటి ఫాలోయింగ్ లేదు. అసలు ఛత్రపతి సినిమా బెల్లంకొండ హీరోగా హిందీ లో నిర్మించడానికి కారణం ఇదే. ఇప్పటికే తనకంటూ హిందీలో ఫాలోవేర్స్ ఉండడం ఇప్పుడు చేసే సినిమా మాస్ సినిమా కావడం బెల్లంకొండకు కలిసొచ్చే అంశాలే.
అయితే ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్సకత్వం వహిస్తుండగా పెన్ స్టూడియోస్ సంస్థ భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా వెచ్చే వారంనుండి మళ్ళీ పట్టాలెక్కనుంది. ఏదేమైనా మన బెల్లంకొండ కు ఒకే దెబ్బకు బాలివుడ్ లోకు అడుగు పెట్టేసాడు.
Read Also పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన అల్లరి నరేష్