మంగళవారం, నవంబర్ 28, 2023
Homeసినిమారాజమౌళి చేతులమీదుగా చత్రపతి షూటింగ్ మొదటి షాట్

రాజమౌళి చేతులమీదుగా చత్రపతి షూటింగ్ మొదటి షాట్

హీరో ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమా చత్రపతి తాజాగా ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తుండగా మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే నేడు ఈ సినిమాకు సంబంధించి ముహూర్తం షార్ట్ ను రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు. మూడు నెలల క్రితం ప్రారంభం అవాల్సిన ఈ ప్రాజెక్ట్ కరోనా కారణంగా పట్టలేక్కలేదు ఈ టైం లోనే శ్రీనివాస్ హిందీ డైలాగుల ప్రాక్టీస్, జిమ్ లో వర్కౌట్స్ వంటివి చేస్తూ వచ్చాడు అయితే నేడు రాజమౌళి చేతుల మీదిగా ఘనంగా సినిమాను ఓపెన్ చేసారు.

ఈ కార్యక్రమానికి రాజమౌళి, రమారాజమౌలి తో పాటు విజయేంద్రప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు. ఇక ఈ వినిమాలో హీరోయిన్ గా అనన్యా పండే నటిస్తుందనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన కేరెక్టర్ లు ఎవరు చేస్తున్నారనే విషయం ఇంకా తెలియాల్సివుంది. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తోంది.

అయితే ఛత్రపతి కధను అలాగే తీస్తారా లేక మార్పులూ చేర్పులూ ఉంటాయా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.  అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని బావిస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular