బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం.. అభిమానులకు గడ్డుకాలం

0
144
BCCI New Updates to T20 world cup
BCCI New Updates to T20 world cup

కరోనా ప్రభావం పడని చోటులేదు ప్రతీ రంగాన్నీ వైరస్ అతలాకుతలం చేసింది. ఇక స్పోర్ట్స్ విషయానికొస్తే ఐపీల్ తో సహా అన్ని టోర్నీలు కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఐపీల్ లేకపోవడమే క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు ఇక ఒలింపిక్స్ కి కూడా  కరోనా సెగ తాకింది టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా పడింది. అటు ఎప్పుడో అక్టోబర్ లో జరగాల్సిన 20,20 వరల్డ్‌కప్‌పై బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచం మొత్తం స్తంభించిన నేపథ్యంలో ఇప్పటిలో ఈ సంక్షోభం గట్టెక్కుతుందో లేదో తెలియని తికమకలో టీ20 వరల్డ్‌కప్‌ జరిగే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ అనేది బహుశా అసాధ్యమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుముందు  ప్రజలు క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి వస్తారనే గ్యారంటీ లేదన్నారు.

బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ అంతర్జాతీయంగా రాకపోకలు, పరిస్థితులు చక్కబడితే తప్ప  మ్యాచ్ లు చూడ్డానికి క్రికెట్ అభిమానులు వచ్చే ప్రశక్తే లేదన్నారు. ఒకవేళ అన్ని మెల్లమెల్లగా చక్కబడ్డా అసలు పరిస్థితులు ఎంతమేర సురక్షితం అనేది అంచనా వెయ్యలేమన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో క్రికెట్ లేనట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది క్రికెట్ అభిమానులకు గడ్డుకాలమనే చెప్పాలి.