గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ళ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే అయితే ఈ ఇళ్ళ నిర్మాణ విషయంలో ప్రభుత్వం పేదలను ప్రభుత్వం మోసం చేస్తుందని టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇళ్ళ నిర్మాణంపై టీడీపీ నాయకులు అయితే సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ళలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలు ఎలా కాపురం చేస్తారని విమర్శించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ ఇళ్ళ నిర్మాణ విషయంపై టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వం పై మరియు సీఎం జగన్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తుగ్లక్ జగన్ రెడ్డి మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను మోసం చేస్తున్న విషయం ప్రజలు గమనించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల ఇళ్ళను కట్టిస్తానని ఆర్బాటాలు చేసి కొన్ని లక్షల రూపాయలతో పేపర్లో ఎడ్వర్టైజ్ ఇచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా సొంత డబ్బా కొట్టుకుంటూ ప్రతీ ఇంటికీ లక్షా ఎనబై రూపాయలు సాంక్షన్ చేసామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న లక్షా యాబై వేల రూపాయలు, నరేగా కింద (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం) క్రింద ముప్పై వేల రూపాయలతో కలిపి మొత్తం లాక్షా ఎనబై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే రాష్ట్రంలోని జగన్ ఒక్క రూపాయి కూడా పేదల ఇళ్ళ స్థలాలకు ఖర్చు పెట్టకుండా మొత్తం తనే ఇస్తున్నట్టు మంత్రులతో సహా డప్పు కొట్టుకుంటున్నారని విమర్శించారు.
పేదలకు ఇళ్ళు కట్టివ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాని ఇళ్ళ నిర్మాణానికి అయ్యే కర్చు ఎంత అవుతుందో ప్రజలకు చెప్పాలన్నారు. లక్షా ఎనబై వెలతో అసలు ఇంటి నిర్మాణం అవుతుందా అంటూ ప్రశ్నించారు. కరోనా సమయంలో ఇంటి నిర్మాణానికి దిగి ఆ డబ్బులు చాలకపోతే ప్రజలకు మరింత భారం అవుతుందన్నారు. ప్రభుత్వం చెప్పే ఈ డబ్బులతో ఇంటి పునాది కూడా కట్టలేమన్నారు. నేడు పెరిగిన ధరలతో పోలిస్తే సుమారు మూడు లక్షల రూపాయలు అవుతాయన్నారు.