ప్రతిష్టాత్మక అర్జున అవార్డు.. అర్హులు శిఖర్ లేక బుమ్రా.. ?

0
162
bumrah and shikhar dhawan
bumrah and shikhar dhawan

బీసీసీఐ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు కోసం ఈ ఏడాది మన టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరును ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బీసీసీఐ బోర్డు ఒకటి కంటే ఎక్కువ పేర్లు ప్రతిపాదించాలంటే శిఖర్ ధావన్ కూడా రేసులోకి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అంచనా. బీసీసీఐ 2018 లో ధావన్ పేరును ప్రతిపాదించినా నిరాశమిగిలింది ధావన్ కు అర్జున అవార్డు దక్కలేదు.

ఇక మహిళల విషయంలో కూడా బీసీసీఐ పేర్లు నమోదు చేయనుంది. ఈ విభాగంలో దీప్తి శర్మ పేరును అర్జున అవార్డు కోసం ప్రతిపాదించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇక బుమ్రా పై అందరికీ అంచనాలున్నాయి. 28 ఏళ్ల బుమ్రా 14 టెస్టుల్లో ఇప్పటివరకు 68 వికెట్లు తీసాడు. 50 టీ 20 ల్లో 59 వికెట్లు, 64 వన్డేల్లో 104 వికెట్లు పడగొట్టాడు.