గురువారం, జూన్ 8, 2023
Homeసినిమా20న అరవింద సమేత సాంగ్స్ రిలీజ్ - ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎవరో...

20న అరవింద సమేత సాంగ్స్ రిలీజ్ – ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..!

జూనియర్ ఎన్టీఆర్ , పూజా హెగ్డే కలిసి నటిస్తున్న మూవీ అరవింద సమేత వీరరాఘవ దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల కానున్న నేపధ్యంలో ఈ మూవీ సాంగ్స్ ను ఈ నెల 20న నేరుగా ఆన్ లైన్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి.

‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే దీనిలో పూజా జర్నలిస్ట్ గా కనిపించనుందని సమాచారం. విదేశాల నుండి ఇండియాకి వచ్చిన ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా , వీడియో జర్నలిస్ట్ గా ఇందులో కనిపించనుందట. సినిమా సగానికి పైగా రాయలసీమ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడిగా కనిపించనున్నాడు.

 

ఇక సునీల్, పూజా హెగ్డే ల మద్య వచ్చే సన్నివేషాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని ఫిలింనగర్ సమాచారం. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తొలిసారి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే అయితే ఈ నెల ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఈచిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అక్టోబర్ మొదటి వారంలో జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

దీనిని రాయలసీమలో కానీ లేక ఆంద్రాలో కానీ ఈ ఫంక్షన్ జరపాలనుకున్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అటు బాలయ్య బాబు ఇటు చంద్రబాబు కూడా హాజరవుతారని సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా చాలకాలం తరువాత ఎన్టీఆర్, బాలయ్య, చంద్రబాబు ఒకే వేదికపైకి రావడం అనేది నందమూరి ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తే.

RELATED ARTICLES

Most Popular