శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023
HomeHOMEస్పీకర్ తమ్మినేని పై సంచలన కామెంట్స్ చేసిన హైకోర్టు

స్పీకర్ తమ్మినేని పై సంచలన కామెంట్స్ చేసిన హైకోర్టు

గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం న్యాయస్థానాలు సైతం ప్రభుత్వ తీరును మార్చుకోమని చెప్పినా అవేవీ పట్టించుకోకుండా రాజ్యాంగానికి విరుద్దంగా నాయకులు తమ నోటి దురుసుతో న్యాయస్థానాలను సైతం కించపరుస్తూ వాటినే ప్రశ్నించే స్థాయికి దిగజారారు.

ఇక ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ గా చేసుకుని మీడియాతో ప్రజలముందుకు వచ్చిమరీ ఒక మనిషి మాట్లాడకూడని అసభ్య పదజాలంతో మాట్లాడడం నేటి సభ్య సమాజం తలదించుకునే స్థాయికి తీసుకువచ్చారు. అయితే గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి కూడా న్యాయస్థానం పై స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై నేడు హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

భాద్యత గల రాజ్యాంగబద్దమైన పదవిలో కొనసాగుతూ న్యాయవ్యవస్థలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్న హైకోర్టు హైకోర్టు ఇచ్చే తీర్పులపై ఏమైనా అసహనం ఉంటె సుప్రీంకోర్టును ఆస్త్రయించవచ్చని తెలిపింది. అంతేకాక స్పీకర్ తమ్మినేని ఈ వ్యాఖ్యలు శాసనసభలో చేసారా లేక బయట ఎక్కడైనా చేసారా అని అడిగిన హైకోర్టు తిరుపతి కొండమీద మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారని న్యాయవాది తెలిపారు.

ఒక సారి కోర్టు ఇచ్చిన తీర్పులను బహిరంగ వ్యాఖ్యలు సరికాదని తేల్చి చెప్పింది. అంతేకాక ఏపీ లో నెలకొన్న ఇప్పటి పరిస్థితులను చూస్తే దేశంలో ఎక్కడా ఇలాంటివి నెలకొనలేదనిఅన్న హై కోర్టు ఈ విషయాలన్నీ చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు ఉందంటూ సంచలన కామెంట్స్ చేసింది హైకోర్టు.

అయితే గతంలో వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్య కామెంట్స్ చేయడంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి సీఐడీ కి అప్పగించడంతో ఈ కేసులో సీఐడీ నుండి ఎటువంటి పురోగతీ లేదంటూ ఇలాంటప్పుడు సీబీఐ కి ఇస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. అయితే తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది.       

RELATED ARTICLES
- Advertisment -

Most Popular