అమరావతి రైతుల భారీ విజయం…మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం ఉపసంహరణ

0
877
amaravathi news
amaravathi news

మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభత్వం చాలా రోజుల తరువాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయత్ర నిర్విరామంగా కొనసాగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం నుండి ఇలాంటి నిర్ణయంతో ఆశ్చర్యపోతున్నారు రైతులు. ఇప్పటికే ఈ విషయం కోర్టులో వాదనలు జరుగుతుండడం మరియు ఈ బిల్లుపై రైతులు వేసిన పిటిషన్ తో పాటు మరికొన్ని పిటిషన్లు హైకోర్టులో ప్రస్తుతం రోజువారీ వాదనలు జరుగుతున్నాయి అయితే ఈ బిల్లు రైతులకే ఫేవర్ గా రావచ్చనే దీమాగా రైతులు ఉన్నారు.

మూడు రాజధానుల బిల్లు పిటిషన్ తో హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి పరాభవం తప్పదనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనేది తెలియాలి. రాష్ట్ర  ప్రస్తుతం ప్రస్తుతం ఇంత హుటాహుటిన ఈ మూడురాజధానుల విషయాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక ఇంకేమైనా ప్లాన్ ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తునారు. అయితే ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఈ బిల్లు ఉండడంతో ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక ఈ బిల్లు ఉపసంహరణ మీద అసెంబ్లీలో కూడా జగన్ ప్రస్తావిస్తారని తెలుస్తోంది.

Read Also: అమరావతి మహిళలపై మళ్ళీ అదే సెటైర్లు

Read Also: మీ మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు…చంద్రబాబు గారి అంగీకారం ఇక అవసరం లేదు ..బాలకృష్ణ

                  

WhatsApp Group Join Now