ఏపీ ఎన్నికల కమీషనర్ ను తొలగిస్తూ జీవో జారీ

0
187
ap government remove nimmagadda ramesh kumar
ap government remove nimmagadda ramesh kumar

ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత నెల జరగాల్సిన  ఎన్నికలను రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా స్థానిక ఎన్నికలను రద్దీ చేశారు. 

దీనితో తీవ్ర ఆగ్రహానికి లోనైనా సీఎం జగన్ మీడియా సమావేశంలో   నిమ్మగడ్డ రమేష్ పై విరుచుకు పడ్డారు.  ఒక కులాన్ని సైతం చర్చకు తెస్తూ సీఎం హోదాలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తర్వాత సుప్రీమ్ కోర్టును కూడా ఆశ్రయించారు సుప్రీమ్ కోర్టు ఎన్నికలు విషయం తమ పరిధిలో లేదని తాము జోక్యం చేసుకోలేమని కొట్టేయడంతో ఈ రోజు ఉదయం ఎలక్షన్ కమీషనర్ ను తొలగిస్తూ రెండు జీవోలను కాన్ఫిడెన్సిల్ గా ఉంచి  వాటిని గవర్నర్ వద్దకు తీసుకు వెళ్లడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

అయితే ఈ జీవో ప్రభుత్వానికి సంక్రమించిన అధికారం తో జీవో జారీ చేసినట్టు తెలిపారు. అయితే దీనిపై సిపిఐ నేత రామకృష్ణ  స్పందిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా లేనందువల్ల ప్రభుత్వం  కక్షగట్టి ఎలక్షన్ కమీషనర్ తప్పిస్తున్నారన్నారు. ఒక వేల ఎన్నికల కమీషనర్ ఎన్నికలను కొనసాగించినట్లయితే కరోనా మహామ్మరు మరింత వ్యాప్తి చెందుండేది అనడంలో అతసయోక్తి లేదు.