గురువారం, మార్చి 28, 2024
Homeరాజకీయంప్రభుత్వ పాఠశాలను చూసి ముగ్దులౌతున్న తల్లితండ్రులు. చదువుతోనే సమాజంలో మార్పు

ప్రభుత్వ పాఠశాలను చూసి ముగ్దులౌతున్న తల్లితండ్రులు. చదువుతోనే సమాజంలో మార్పు

జగన్ ప్రభుత్వం ఎన్నికలకి ముందు పాదయాత్రలో బాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. దీనిలో బాగంగానే నాణ్యమైన చదువుని పేద ప్రజలకు అందిస్తామని మాటిచ్చిన జగన్ ఇప్పడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను కరోనా కారణంగా విద్యార్ధులకు సెలవులు రావడంతో నాడు-నేడు లో భాగంగా పాఠశాలల అభివృద్ది చాలా వరకూ పూర్తి చేసారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ మోడల్ స్కూల్స్ మాదిరిగా వీటిని తీర్చి దిద్దారు. అబివుద్ది చేసిన ఈ స్కూల్లలో తరగతి గదులలో టైల్స్, వాల్ చాట్స్, ఫర్నిచర్, టాయిలెట్స్, ఆటస్థలం వంటి వాటిని ఆధునీకరిస్తున్నారు.

వీటితో పాటు విద్యార్ధులకు మెరుగైన కార్పోరేట్ స్థాయి విద్య మరియు భలమైన ఆహారం అందిచి చదువుతోనే సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా ఒక ప్రభుత్వ స్కూల్ కి వేసిన పెయింటింగ్ ఇప్పుడు చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.

ఒకప్పటి ప్రభుత్వ స్కూల్స్ మరియు ఇప్పుడున్న స్కూల్స్ ను చూసి విద్యార్ధుల తల్లితండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ కి వేసిన పెయింటింగ్ చూసి అటుగా వెళ్ళే వాహనదారులు ఫోన్ లో తెగ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.     

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular