ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు అందుకున్న రుణాలకుగానూ ఇప్పటివరకూ చెల్లించాల్సిన 2019-20 సంవత్సరంలోని వడ్డీకై ఆంద్రప్రదేశ ప్రభుత్వం రూ. 975.19 కోట్లు మాఫీ చేసినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ వడ్డీలేని రుణాలకు గానూ ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మొదట 210 కోట్ల రూపాయలు కేటాయించగా మరోసారి ఇప్పుడు అదనంగా రూ.765.19 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను రిలీజ్ చేసింది.
వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా చివరి ఏడాది ప్రభుత్వం నుండి రుణాలు తీసుకున్న వడ్డీ సంఘాల అక్కౌంట్ లో తాజాగా వడ్డీని డిపాజిట్ చేస్తారు. ఇక మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలకి 314.89 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
WhatsApp Group
Join Now