మంగళవారం, నవంబర్ 28, 2023
Homeరాజకీయంప్రభుత్వం 1000 రూ సాయం మీకు ఇంకా అందలేదా అయితే ఇలా చెయ్యండి

ప్రభుత్వం 1000 రూ సాయం మీకు ఇంకా అందలేదా అయితే ఇలా చెయ్యండి

కరోనా ప్రభావంతో ఎటువంటి పనీ లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్దిక సాయంగా 1000 రూపాయలు పంపిణీ చేసింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ డబ్బులను పంపిణీ చేయడం పూర్తయింది. ఇంకొన్ని చోట్ల డబ్బులు రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ డబ్బులు కొత్త రైస్ కార్డులు వచ్చిన వారు మరియు పాత రేషన్ కార్డులు ఉన్నవారు కూడా దీనికి అర్హులే. అయితే చాలా చోట్ల వెయ్యి రూపాయలు అందకపోవడంతో ప్రభుత్వం పై పలు విమర్శలోచ్చాయి. దీనితో ఆన్లైన్ ద్వారా మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది తెలుసుకునేందుకు gramasachivaalayam.ap.gov.in అనే వెబ్సైటు లోకి వెళ్లి అక్కడ Rice Card Status Check అని కనిపిస్తుంది.

అక్కడ కనిపించే సెర్చ్ బార్ లో కొత్త రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి. ఇలా ఎంటర్ చేసిన తరువాత క్రింద మెంబెర్ నేమ్, హెడ్ఆఫ్ ఫ్యామిలీ , స్టేటస్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో Status అనే ఆప్షన్ లో మీకు డబ్బులు పడినట్లయితే Amount Distributed అని అమౌంట్ మీకు ఇవ్వకపోతే స్టేటస్ లో Amount Pending అని చూపిస్తుంది.

అయితే కొత్త రైస్ కార్డ్ నెంబర్ తెలియని వారు spandana.ap.gov.in అనే వెబ్ సైట్ కి వెళ్లి అక్కడ కార్డు హోల్డర్ ఆదార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద రైస్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది. ఒకవేళ మీ రేషన్ కార్డ్ వేరే వూరిలో ఉండి మీరు వేరేచోట ఉంటె ఈ spandana.ap.gov.in ద్వారా మీరు ఏ సచివాలయానికి చెందుతారో, మీకు ఏ సచివాలయంలో డబ్బులు విడుదల అయ్యయో దీనిద్వారా తెలుసుకోవచ్చు.

ఒకవేళ మీకు 1000 రూపాయలు రేలీజ్ అయ్యి డబ్బులు ఇవ్వకపోయినట్లయితే 1902 / 1967 / 18004250082 నెంబర్ లకి ఫోన్ చేసిన యెడల వారు మీ ఆధార మరియు పూర్తి వివరాలు తీసుకుని కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు.

తద్వారా ఆ కంప్లైంట్ మీ గ్రామ సచివాలయానికి ఫార్వార్డ్ చెయ్యబడుతుంది తద్వారా గ్రామ వాలంటీర్ మీకు 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కొత్త రైస్ కార్డ్ లలో డేటా పాతది కావడంతో పేర్లు తప్పులతో వస్తున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular