ప్రస్తుతం పోతిరెడ్డి పాడు అంశంపై రెండురాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. ఏపీ ప్రభ్యత్వం నిబంధనలకు విరుద్దంగా శ్రీశైలం జలాశయం నుంచి మోతాదుకు మించి ఏపీ.. కృష్ణా జలాలను తరలించుకు పోవడానికి దాని సామర్థ్యం పెంచుతుందనేది తెలంగాణ ప్రభుత్వం వాదన.
కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు మాత్రమే రాయలసీమకు ఉంది. వరదలు అధికంగా వచ్చే సమయంలో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా ఆ నీటిని తరలించుకుని ఆ ప్రాజెక్టు చేపట్టారు..
అయితే ప్రస్తుతం దీనిపై రెండు రాష్ట్రాలు తగువులాడుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు విషయంలో ఎపి సర్కార్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ జీవో 203 ను విడుదల చేయడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తోంది. దీనిపై ఇప్పటికే కృష్ణారివర్ బోర్డు కు అలాగే కేంద్రానికి కంప్లైంట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఇక దీనిపై ఎపి కూడా ఘాటుగానే స్పందించింది. తమకు రావాల్సిన వాటాకంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ తోడుకోమని ఈ విషయాన్ని మానవతా దృక్పధంతో చూడాలని ఎపి ప్రభుత్వం బదులివ్వడం గమనార్హం. అయితే తెలంగాణ మంత్రులు ఘాటు వ్యాఖ్యలే చేశారు అవగాహన లేని ఇంజనీర్ లు జగన్ కు సలహాలు ఇస్తున్నారన్నారని పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ పనినైనా అడ్డుకుని తీరతామని అన్నారు