ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమాపట్టాలెక్కిన ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హైవే మూవీ

పట్టాలెక్కిన ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హైవే మూవీ

టాలివుడ్ లో అతడు, దూకుడు, బాద్షా వంటి సూపర్ హిట్ సినిమాలకు ఫోటోగ్రాఫర్ గా పని చేసిన కేవీ గుహాన్ డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం “హైవే” గత కొద్ది రోజులుగా కథా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నేడు పెట్టలేక్కింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి షాట్ నేడు హైదరాబాద్ లో ప్రారంబించారు.

ఇక ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తుండగా హీరోయిన్ గా మానస రాధాకృష్ణన్ కు ఈ సినిమా తెలుగు డెబ్యూ కానుంది. ఇక ఇప్పుడిప్పుడే టాలివుడ్ లో కొత్త రకం జోనర్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆనంద్ దేవరకొండ కి ఈ సినిమా చాలా కీలకంగా మారనుంది.

ఇప్పటికే దొరసాని ఆశించిన స్థాయి విజయం సాదించకపోయినా మిడిల్ క్లాస్ మేలోడీస్ తో మంచి విజయాన్ని సాదించాడు ఆనంద్ దేవరకొండ. ఇక హైవే స్టోరీ విషయానికొస్తే సినిమా మొత్తం హైవే పై సాగే క్రైంత్రిల్లర్ అని దీనికోసం అడ్వాన్ టెక్నాలజీతో భారీ స్థాయిలో నిర్మిస్తిన్నామని నిర్మాత వెంకట్ తలారి చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి త్రిల్లర్ సినిమాగా నిలుస్తుందని అన్నారు.       

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular