శనివారం, ఫిబ్రవరి 4, 2023
Homeజాతీయంఏపీ వైపుకు దూసుకొస్తున్న అంఫాన్ తుఫాన్... రైతన్నలకు కన్నీళ్లు

ఏపీ వైపుకు దూసుకొస్తున్న అంఫాన్ తుఫాన్… రైతన్నలకు కన్నీళ్లు

ఇప్పటికే కరోనా దెబ్బతో  అల్లాడి పోతున్న రాష్ట్రానికి ఒకదాని తరువాత ఒకటి వరుసదేబ్బలు తగులుతున్నాయి. … కరోనాను సాగనంపడం కోసం అధికారులు, డాక్టర్లు, పోలీసులూ నిద్రాహారాలు మానేసి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాన్ని వదిలి పని చేస్తున్నారు, కరోనాను ఎంతోకొంత అదుపు చేస్తున్న తరుణంలో  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై మరో ఉపద్రవం ప్రవేశించడానికి రడీగా ఉంది.

మే9 నుండి మే11 తేదీ లోపు అంఫాన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడనున్నట్లు  డిల్లీ కి చెందిన Regional Specialized Meteorological Centre – Tropical Cyclones విభాగం ఇప్పటికే సమాచారం అందించింది. … మే 9 తర్వాత ఏ సమయంలో అయినా ఈ తుఫాను రాష్ట్రాన్ని బలంగా తాకే ప్రమాదం ఉంది… ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అటు బోర్డర్ లో ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా ఈ తుఫాను పై ముందుగానే దీని భారినుండి తప్పించుకోవడానికి ప్రణాలికలు సిద్దం చేస్తుంది. మన రాష్ట్రంపై ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి అని తెలియటంతో ప్రభుత్వ అధికారులు ఇప్పడు దీనిపై ద్రుష్టి సారించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది ఒక వైపు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తినడానికి తిండి, చేయడానికి పని లేక అవస్థలు పడుతుంటే ఉన్న ఒక్కా ఆధారం వ్యవసాయం కూడా చేతికాడికి వచ్చింది నోటిదాకా వస్తుందో రాదో అనే దిగులుతో గడుపుతున్నారు. పండిచిన దాన్యం మొత్తం చేలలోనే ఉండిపోయింది.

ప్రస్తుతం కోత కోయడానికి కూలీలు దొరక్క కోత మిషన్లపై ఆధారపడుతున్నారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఒకవేళ వచ్చినా వాళ్ళు అడిగినంత ఇవ్వక తప్పదు. ఇలాంటి వొడిదుడుకులను ఎదుర్కొనే రైతన్నల కష్టాలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా  గుర్తించి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కోరుకుందాం.

RELATED ARTICLES

Most Popular