శుక్రవారం, మార్చి 29, 2024
Homeఅంతర్జాతీయంఅమెరికాలో చైనా కంపెనీల గూఢచర్యం

అమెరికాలో చైనా కంపెనీల గూఢచర్యం

చైనాలో కరోనా విజృంభణతో  ప్రపంచదేశాలు పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి. దీనితో అగ్రరాజ్యం అమెరికా చైనా పై ఛాన్స్ దొరికిన ప్రతీచోటా ఆంక్షలు విదించే విధంగా పావులు కదుపుతోంది. గత కొన్నిరోజులుగా అమెరికా లోని చైనా స్టాక్ ఎక్స్చేంజ్ లో  ట్రేడ్ అయిన సూచీలను డీలిస్ట్  చేసి వాటిని అమెరికా నిషేదిస్తునట్లు తెలిపిన అమెరికా చెప్పిన  ప్రకారమే అమెరికా సెనేట్ సైతం దీనికి ఆమోదముద్ర వేసింది.

తాజాగా అమెరికాలో ఉన్న పలు చైనా కంపెనీలపై అమెరికా నిషేధించింది. దీనికి కారణం అమెరికాలో ఉన్న చైనా కంపెనీల నుండి చైనా మిలటరీ కి సమాచారం ఆయా కంపెనీలు గుట్టుచప్పుడు కాకుండా అందిస్తున్నాయని అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  అయితే అమెరికా పలుమార్లు చైనా నుండి దిగుమతి చేసే వస్తువులపై భారీగా సుంకం పెంచడంతో  చైనా సైతం అక్కడి నుంచి వచ్ఛే వస్తువుల పై సుంకం పెంచేసింది.

దీనితో రెండు దేశాల మధ్య చాలా రోజుల పాటు ట్రేడ్  వార్ కొనసాగింది. తాజాగా కొన్ని  రోజులుగా రెండు దేశాలలో మద్య వివాదం పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం పట్ల రెండు దేశాల మధ్య  తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular