క్వారెంటెన్ అయ్యాకా చేతికి డబ్బు సీఎం జగన్ ఆదేశం.

0
152
Quarantine in ap
Quarantine in ap

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రులు ఉన్నతాధికారులతో బుధవారం సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా కట్టడిపై అలాగే ఏపీలో నమోదవుతున్న కేసులపై అధికారులు సీఎం కి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో  రోజుకి 2100 కరోనా టెస్టులు జరుగుతున్నాయని త్వరలో వాటిని రోజుకు 4000 టెస్టుల సామర్ధ్యానికి తీసుకువెళ్తామని సీఎం కు వివరించారు అధికారులు..

ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాలు జారీచేశారు క్వారెంటెన్ చికిత్స పూర్తయినతరువాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేసమయంలో ఒక్కో వ్యక్తికీ 2000 రూపాయలు అందజేయాలని సూచించారు. దీనితోపాటు వైరస్ తగ్గిపోయిందని అజాగ్రత్తగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా వాళ్ళకి వైద్యులు అలాగే అధికారులు అన్ని సూచనలు చెయ్యాలని సీఎం తెలిపారు.