బుధవారం, జూలై 17, 2024
Homeజాతీయం14 తరువాత APS RTC ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసింది.. మరి లాక్ డౌన్ ఉంటుందా.?

14 తరువాత APS RTC ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసింది.. మరి లాక్ డౌన్ ఉంటుందా.?

21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14 తో పూర్తీ అవుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతోన్న ప్రశ్న. ఓ వైపు దేశంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఏమాత్రం అదుపులో లేవు ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేక మరికొన్ని రోజులు పొడిగిస్తారా అనే అనుమానం ప్రజల్లో నెలకొంది.

అయితే APS RTC మాత్రం ఏప్రిల్ 15 నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధమైంది ఇప్పటికే బుక్కింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. కానీ కేవలం లగ్జరీ, సూపర్ డీలక్స్ బస్సులు మాత్రమే తిప్పుతామని తెలిపింది.

ఏసీ బస్సులను నిలిపివేయనుంది..ఆయా రూట్స్ లో బుకింగ్స్ బట్టి రోజు బస్సులను పెంచనున్నట్టు తెలిపింది. ఏసీ బస్సులు తిప్పడం మొదలుపెట్టాకా కూడా వాటిలో టెంపరేచర్ 25,26 డిగ్రీలు ఉండేటట్టు చూస్తామని APS RTC వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ లో లాక్ డౌన్ పై ఉన్న ప్రశ్నలకు ఒకింత సమాధానం దొరికిందనే చెప్పాలి

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular