ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా భలగాల ఉపసంహరణ తరువాత ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది ఒకవైపు దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లు నిన్న పూర్తి స్థాయిలో దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ముందుగా మూడు నెలల్లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకునే అవకాసం ఉందంటూ చెప్పుకొచ్చిన అమెరికా నాలుగు వారాలు గడవక ముందే తాలిబన్ దేశాన్ని ఆక్రమించుకుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ అద్యక్ష భవనంలోకి ప్రవేశించిన తాలిబన్ అద్యక్షుడు నేటితో యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశాన్ని విడిచి పారిపోయారని అక్కడి న్యూస్ చానెల్ ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా కూడా అష్రఫ్ ఘని స్పందిస్తూ ఇకపై రక్తపాతం జరగకూడదని నేను ఈ నగరాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతున్నా అంటూ ఘనీ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అయితే కాభుల్ నగరం అస్థవ్యస్తంగా తయారైంది. ఎక్కడ చూసినా ప్రజలు ఒట్టి చేతులతో కాభుల్ నగరంలో ఉన్న విమానాశ్రయానికి భారీగా జనాలు చేరుకుని మమ్మల్ని ఎలాగైనా ఈ దేశం నుండి బయట పడేయండంటూ బ్రతిమిలాడుతున్నారు.

కాభుల్ విమ్మానాశ్రయంలో ఉన్నది ఒక్కటే విమానం అయితే విమానాశ్రయానికి వచ్చింది మాత్రం వేలల్లో ఉన్నారు. ఇప్పటికే గతంలో తాలిబన్ల పాలనను కళ్ళారా చూసిన ఆఫ్ఘన్ ప్రజలు తాలిబన్ల పాలన అనే ఊహకే ప్రజలు భయపడుతున్నారు. ఇక మహిళల పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతుంది. వారిపై ఆంక్షలు మొదలవుతాయి చదువుకావాలనుకునే మహిళలకు ఇకపై వారి ఆశ అడియాషగా మారనుంది.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ఆక్రమించుకున్న తరుణంలో అమెరికాలో ఉన్న ఆఫ్ఘన్ ప్రజలు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై మండిపడుతూ వైట్ హౌస్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆఫ్ఘన్ లోని పరిస్థితి పై ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకూవాలని నిర్ణయించింది.
Read More….
- అదరగొడుతున్న Ola Electric Scooter 24 గంటల్లో లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల బుకింగ్
- విశాఖ భూగర్భంలో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్.. భారీ ప్రాజెక్ట్ చేపట్టిన కేంద్రం