బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeసినిమాకాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆధాశర్మ

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆధాశర్మ

ఈ మద్య గత కొద్ది రోజులుగా  సినిమా ఇండస్ట్రీ లో బాగా ఎక్కువగా వినిపిస్తున్న ఒక్క మాట కాస్టింగ్ కౌచ్. దీనిపై టాలివుడ్ లో చాలా రోజులుగా పెద్ద చర్చే జరుగుతుంది. అడిగింది ఇస్తే ఆఫర్ ఇస్తా అన్న చందంగా తయారైంది. కొత్తగా వస్తున్న హీరోయిన్లు సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెట్టి తమ సొంత టాలెంట్ తో అందర్నీ ఆకుట్టుకుని తమకంటూ ఒక గుర్తింపు తేచ్చుకోవాలని తాపత్రయ పడతారు. కాని ఒక్క సారి మొదటి సినిమా వచ్చిన తరువాత రెండో సినిమా నుంచి మొదలౌతుంది వీరి కష్టాలు.

సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా ఆఫర్స్ రాకపోవడంతో మానసికంగా కృంగిపోయి వారి మెయింటినెన్స్ కి డబ్బులు లేక తప్పని పరిస్థితిలో కాంప్రమైజ్ అవుతున్న పరిస్థితి. మన ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ లో కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలు వీరిలో మూడో వంతు కాస్టింగ్ కౌచ్ కారణంగా అబిమానాన్ని చంపుకోలేక టాలెంట్ ఉన్నాసరే ఇండస్ట్రీ నుండి వేల్లిపోయినవారు చాలా మందే ఉన్నారు.

అసలు తెలుగు ఇండస్ట్రీ చరిత్ర చాలా పెద్దది అయినా తెలుగు హీరోయిన్స్ పదిమంది కూడా లేకపోవడానికి కారణం కాస్టింగ్ కౌచ్ వల్ల ఆయా కుటుంబాలలో ఇండస్ట్రీ పట్ల చిన్న చూపు ఉండడమే. కొంత మంది ఇండస్ట్రీ లో జరుగుతున్న దాన్ని దైర్యంగా బయట పెడుతుంటే కొందరు మాత్రం వారి వెనక బ్యాక్ గ్రౌండ్ చూసి దైర్యంగా ముందుకు రావడానికి బయపడుతున్నారు.

ఇందంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానా అనుకుంటున్నారా కాస్టింగ్ కౌచ్ గురించి హీరొయిన్ ఆదాశర్మ తాజాగా స్పందించింది. కాస్టింగ్ కౌచ్ అనేది చిన్న తారల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోయిన్స్ వరకూ అందరికీ ఈ సమస్య ఉంటుందన్నారు. ఇది ఉత్తరాది, దక్షినాది అనే తేడా లేకుండా ఈ సమస్య ప్రతీ చోటా ఉందని చెప్పుకొచ్చింది. ఇక్కడ బలవంతం ఉండదు నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular