గురువారం, మార్చి 23, 2023
Homeరాజకీయంబిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్

బిగ్ బ్రేకింగ్ : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈఎస్ఐ వైద్య పరికరాల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందనే కారణంతో  శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో అచ్చెన్నాయుడు ని అరెస్టు చేయడం జరిగింది అచ్చెన్నాయుడు ని అసెంబ్లీకి నాలుగు రోజుల ముందు వందమంది పోలీసులతో కిడ్నాప్ చేశారంటూ టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు  విశాఖకు తరలించినట్లు తెలుస్తుంది. టిడిపి సీనియర్ నేత పట్టాభి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతీది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ఏదో ఒక నెపంతో టిడిపి పార్టీలో కీలక నేతలుగా ఉన్న వ్యక్తుల పై అనేక కేసులు మోపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

అచ్చెన్నాయుడు అసెంబ్లీ లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన గురించి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో ఏదో ఒక విధంగా టీడీపీలోని కీలక నేతలను వైసీపీలోకి లాగుతున్నారని, అనేకమైన అక్రమ కేసులు ఈ ప్రభుత్వం పెడుతుందని పట్టాభి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Most Popular