Aakasam Nee Haddura Movie Review
నటీనటులు: సూర్య, మోహన్ బాబు , పరేష్ రావాల్, అపర్ణ బాలమురళి తదితరులు
సంగీతం : జీవీప్రకాష్
డైరెక్టర్ : సుధా కొంగర
సినిమాటోగ్రఫీ : బొమ్మిసేట్టి నికేత్
నిర్మాత: సూర్య
లాక్ డౌన్ మొదలుకొని ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలలో చాలా వరకూ చిన్న సినిమాలే ఎక్కువ ఇక పెద్ద హీరోల ఫ్యాన్స్ వారి సినిమాల కోసం ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోరుకున్నట్లు గానే నేడు సూర్య నటించిన “Aakasam Nee Haddura” అనే పేరుతో తెలుగులో రిలీజ్ అవ్వగా తమిళంలో “సురారై పోట్రు” గా ఒకేసారి మూవీ రిలీజ్ కు నోచుకుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా తాజాగా నేడు ఓటీటీ ఫ్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది Aakasam Nee Haddura మూవీ.
ఆకాశం నీ హద్దురా అంటూ ప్రజల ముందుకు వచ్చిన ఈ సినిమా కధ విషయానికొస్తే సాదారణ ప్రజలకు కూడా తక్కువ కర్చుతో విమాన ప్రయాణం అందిచాలనే ఉద్దేశ్యంతో స్థాపించిన “డెక్కన్ ఎయిర్” వ్యవస్థాపకుడు అయిన గోపీనాద్ గారి నిజ జీవిత కధను ఆదారంగా మలిచినదే ఈ “ఆకాశం నీ హద్దురా” మూవీ.
కథ:
గుంటూరు జిల్లా సుండూరు గ్రామంలో ఉన్న ఒక మాస్టారు గారి అబ్బాయే సూర్య (మహా). తండ్రి గాందేయవాది తన గ్రామ అభ్యుదయానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కొడుకు మహా.. అయితే మహా మాత్రం పేదవారికి కూడా తక్కువ ధరకే విమాన ప్రయాణం అందివ్వాలని కోరుకుంటాడు.
ఈ తరుణంలోనే తాను సంపాదించుకున్న ఎయిర్ ఫోర్సు ఉద్యోగానికి రాజీనామా చేసి తన ప్రాజెక్ట్ అయిన ఎయిర్ లైన్స్ సంస్థ ఎలా స్థాపించాడు, ఈ సంస్థ స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, విమానం దిగడానికి అధికారులు ఎందుకు ఒప్పుకోలేదు? అనేది ఆకాశం నీ హద్దురా స్టోరీ.
విశ్లేషణ:
డైరెక్టర్ సుధా కొంగర తీసుకున్న కధ ప్రధానంగా చాలా వరకూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడంలో పూర్తిగా సఫలం అయ్యారు. ప్రతీ సీన్ లోనూ అదేరీతిలో నటీనటుల మార్క్ కనిపించేలా జాగ్రత్తపడ్డారు. సినిమా స్టార్ అయిన మొదటి పది నిమిషాలలోనే ప్రేక్షకుడిని తాను తీసుకున్న పాయింట్ ను ప్రేక్షకుడికి చెప్పేస్సారు.
అంతేకాక దానిలో లీనం అయ్యేలా చేయడంలో సుధా కొంగర సక్సస్ అయ్యారు. అయితే కొన్ని సీన్లు రిపీట్ అవుతున్న ఫీల్ కలుగుతుంది. సినిమాకు కొద్దిగా కెత్తెర పడుంటే మరింత బాగుండేది. ఇక సూర్య వాయిస్ ఈ సినిమాపై కొంచే నేగిటీవ్ ఇంఫాక్ట్ పడిందనే చెప్పాలి.
నటీనటుల పనితీరు:
గత కొన్నాళ్ళుగా వరుస ప్లాప్ లతో సతమవుతున్న సూర్య తన పూర్తి ఆసలను ఈ సినిమాపైనేపెట్టుకున్నాడు. ఇక సూర్య నటనకు ఈ సినిమాలో ఎన్ని మార్కులు వేసినా తక్కువే అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని సినిమాను మరోస్థాయికి తెసుకువేల్లాడు. తన తండ్రి చనిపోతున్నప్పుడు వచ్చే సీన్ లో సూర్య నటన అద్భుతం అనే చెప్పాలి.
ఇక హీరోయిన్ విషయానికి వస్తే అపర్ణ బాలమురళి నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక మోహన్ బాబు నటన పరంగా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. మొత్తం చినిమాలో కేవలం మూడు సీన్లకే పరిమితం చేసారు.
సూర్య చేసే ప్రతీ పనికీ అడ్డుతగులుతూ సూర్యకి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతూ ఎయిర్ లైన్స్ వొనర్ గా పరేష్ రావత్ నటన బాగుంది. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
సూర్య నటన
నటీనటుల పర్ఫార్మెన్స్
ఎమోషనల్ సీన్స్
సంగీతం
మైనెస్ పాయింట్స్:
తమిళ నేటివిటీ
సినిమా నిడివి
ఇక చివరిగా… ఎలాంటి హద్దులూ లేకుండా తప్పక చూడాల్సిన సినిమా
రేటింగ్: 3/5