బుధవారం, జూన్ 7, 2023
Homeరాజకీయం2019 ఎన్నికల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారో మీఇష్టం.....పవన్

2019 ఎన్నికల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారో మీఇష్టం…..పవన్

2019 ఎన్నికల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారో మీఇష్టం…..

ఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత పర్యటనలో భాగంగా నేడు పవన్ కళ్యాణ్ నిడదవోలు మరియు తాడేపల్లిగూడెంలో సోమవారం బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. లక్ష కోట్లు దోచేసారని చెబుతున్న జగన్ ను చూసారు లక్షన్నర కోట్లు దోచేసారంటున్న చంద్రబాబును చూసారు. ఆ రెండు  దోపిడీ పార్టీలే ఈసారి పవన్ నీ చూడండి అని పవన్ తన ప్రసంగంలో కోరారు.

మీరు చేసిన భూకబ్జాలే సాక్ష్యం … అందుకే జనసేన

పచ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో టిడిపి ఇష్టారాజ్యంగా భూకబ్జాలకు పాల్పడుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెరువులను సైతం మిన్గేస్తున్నారని అందుకే జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలని , రాజకీయ ప్రక్షాళన చేయాలనీ అందుకే జనసేన స్థాపించానని పవన్ అన్నారు.

నాతో మీ నాటకాలు కుదరవు

ప్రత్యెక హోదా 15 సంవత్సరాలు కావాలన్న సిఎం చంద్రబాబు వందసార్లు మాటమర్చారని విమర్శించారు. ఇక వైసిపి అద్యక్షుడు జగన్ అసంబ్లీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేసారు. టిడిపి వెన్నుపోటు రాజకీయాలు పవన్ తో కుదరవని తేదవస్తే కర్రపట్టుకుని పోరాటం చేస్తామని హెచ్చరించారు.

పవన్ కోసం జోరు వానలో జనం 

ప్రజల తీర్పు ఏదైనా జనసేన జనానికి అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. టిడిపి గూండాలకు , రౌడీలకు తాము బయపడే ప్రసక్తే లేదన్నారు. 2019లో తాము అధికారంలోకి వచ్చాక అవినీతిపై అన్నీ తేలుస్తామని ఆయన హెచ్చరించారు. పశ్చిమగోదావరిలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో జోరువానలో సైతం పవన్ కోసం జనం ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం.

 

RELATED ARTICLES

Most Popular