కోనసీమలో 10 షాపుల సీజ్ …

0
157
konasema
konasema

అమలాపురం డివిజన్లో రూల్స్ అతిక్రమించిన  10 షాపులను సీజ్ చేయడం జరిగిందని ఆర్.డి. ఓ బి.హెచ్.భవానీ శంకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మూడవ దశకు చేరుకునే ప్రమాదం పొంచి ఉందని, ఇది ప్రజలందరూ అప్రమత్తతతో వుండవలసిన సమయమని అన్నారు. కోనసీమలో రానున్న 13 రోజులు అత్యంత అప్రమత్తత అవసరమని, డివిజన్ లో చాలా మంది కరోనా వైరస్ తీవ్రతను గుర్తించక సమూహాలుగా అల్లరి చిల్లరగా తిరుగుతున్నారని వాళ్ళు ఇకనైనా మానసిక స్పృహ తో వుండాలని ఆర్.డి. ఓ తెలిపారు.

రేపటి నుండి అన్ని షాపులు ముందు ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని, అలా కాని యెడల షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగు తుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు. అందరు అవగాహనతో ఉంది ముందుకెళితే కరోనా వ్యాప్తిని అరికట్టే వీలుంటుందని అధికారులు అంటున్నారు. 

కానీ ప్రజలు కొంతమంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఇది మంచిపద్దతి కాదన్నారు అందరూ అవగాహనతో ఉండి ముందుకెళితే ప్రజల ఆరోగ్యాలు  బాగుంటాయని తెలిపారు..