కోరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ జీవాలను సైతం భయపెడుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంతో అన్నిరాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విదించారు ఈ నేపద్యంలో వాటికి ఆహారం ఇచ్చేవారు లేక మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని చోట్ల స్వచ్చంద సంస్థలు కొంతవరకూ సహాయం చేస్తున్నా ఇంకా చాలా వరకూ మూగజీవాలు ఆహారం, నీరు దొరక్క రోడ్లపైకి వస్తున్నాయి.
అయితే తమిళనాడు కు చెందిన తిరువన్నామలై లోని అటవీ ప్రాంతానికి దగ్గరగా పది కోతుల కు అరటి పళ్ళలో విషంపెట్టి చంపారు. ఒకే చోట చనిపోయిన కోతులను చూసిన అక్కడి గిరిజనులు అటవీ పోలీసులకు సమాచారం అందించారు.
దీనితో అక్కడికి వచ్చిన అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టగా కొద్ది దూరంలో అరటిపండ్లు కనిపించాయి వాటిని పరిశీలిస్తే వాటిలో విషం కలిపినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాపు చేపట్టారు.
మూగాజీవాలని కనికరం లేకుండా తాను మనిషిననే విజ్ఞతను మరిచి చేసిన ఈ ఘటనపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటిస్తూ తమ వద్దకు వచ్చిన పక్షులకు, జంతువులకు తమవంతు సాయంగా తమ ఇంటి దగ్గరే నీరు,ఆహారం తప్పనిసరిగా అందించండి.
ఈ ఆర్టికల్ నచ్చితే క్రింద ఉన్న ఎమోజీస్ పై కామెంట్ చెయ్యండి.