బంగారం ధర ఆకాశాన్ని తాకనుంది. అదేంటి లాక్ డౌన్ కదా ఎవ్వరూ బంగారం కొనడంలేదుగా మరి ధరలు ఎందుకు పెరుగుతాయి అనుకుంటున్నారా..? మీరు ఆలోచించింది నిజమే కానీ ప్రస్తుతం కొనుగోళ్లు అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి. ఎన్నడూలేనివిధంగా నష్టాలను చవిచూస్తున్నాయి.
దింతో మదుపరులు, పెట్టుబడిదారులు తమ సొమ్మును విలువైన లోహాలమీద ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు దింట్లో బంగారం ఉంది. ఇక ఈ దెబ్బతో రానున్న రోజుల్లో పది గ్రాముల బంగారం ధర 82 వేలకు చేరుకుంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ అంచనా వేసింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 1726 డాలర్లు ఉండగా ఈ ధర 3000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ అంచనా వేస్తోంది. అమెరికాలాంటి దేశాల్లో క్రూడాయిల్ ధర పడిపోవడం, ఈక్విటీ బాండ్ల పరిస్థితి అగమ్యంగా మారడం ఇవన్నీ బంగారంపై ప్రభావం చూపనున్నాయి. కరోనా దెబ్బకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ కుదేలైపోయింది.