గురువారం, ఏప్రిల్ 18, 2024
Homeసినిమారాజమౌళి రిటైర్ అవుతాడట..! ఇక మకాం అంతా ఆ పల్లెటూరిలోనే నట

రాజమౌళి రిటైర్ అవుతాడట..! ఇక మకాం అంతా ఆ పల్లెటూరిలోనే నట

ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. అంతా ఇళ్లకే పరిమితమయ్యారు కాలుకదిపే పరిస్థితిలేదు ఊళ్ళు వెళ్లే ప్రసక్తే లేదు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అటు షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాలైతే కొన్ని అమేజాన్ వంటి ఆన్లైన్ పోర్టల్స్ లో విడుదలకు సిద్ధమవుతున్న పరిస్థితి..ఈ నేపథ్యంలో లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ దర్శక ధీరుడు రాజమౌళి చాలా ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ చెప్పారు.

మామూలుగానే రాజమౌళి ఫ్యామిలీ పెద్దది. పెద్దన్న కీరవాణీ, రాజమౌళి, తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇక పిల్లజల్లా అంతా కలిసి ఎప్పుడూ సందడి సందడిగా గడుపుతుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల బయటకి వెళ్లడం గుంపులుగా ఉండటం కుదరదుకాబట్టి ఎవ్వరం కాలవడంలేదని ఇది కాస్త ఇబ్బందిగానే ఉందని రాజమౌళి పేపర్ ఇంటర్ వ్యూ లో తన లాక్ డౌన్ అనుభవాన్ని అలాగే రిటైర్మెంట్ ఆలోచనని పంచుకున్నాడు.

పూర్వం నుంచి వాళ్ళది ఉమ్మడికుటుంబమని కాబట్టి దాంట్లో ఉండే లోటుపాట్లు, బెనిఫిట్స్ తెలుసని అందుకే అందరం కలిసే ఉంటామని అది చాలా ఆనందాన్ని ఇస్తుందని జక్కన్న చెప్పుకొచ్చాడు. పెద్దన్న కీరవాణి తన కుటుంబం ఎప్పుడు కలిసి సందడిగా ఉంటామని ప్రస్తుత పరిస్థితివల్ల అది కుదరడంలేదన్నారు. ఈ సిట్యుయేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా తప్పదుగా అన్నారు ఇక రిటైర్ మెంట్ విషయం లేవనెత్తగా ఇప్పుడే ఆలోచనేం లేదని దానికి మరో పది సంవత్సరాలు పడుతుందని చెప్పాడు జక్కన్న.

 

రాజమౌళి
రాజమౌళి ఫ్యామిలీ

అయితే రిటైమెంట్ అయ్యాకా మాత్రం సిటీలో ఉండరంట జాయింట్ ఫ్యామిలీ మొత్తం నల్గొండ లోని ఊదులూరు అనే పల్లెటూరు ఉందట అక్కడ కీరవాణి , తాను పక్కపక్కనే పొలాలు కొన్నారట రిటైర్ మెంట్ అయ్యాకా పిల్లలు సెటిల్ అయ్యాక పెద్దవాళ్ళం అంతా అక్కడే ఉంటామని చెప్పుకొచ్చారు జక్కన్న. ఎన్నో విజయాలు సాధించిన దర్శక ధీరుడు మాత్రం ఇలా సింపుల్ లైఫ్ ఎంచుకోవడం భలే బాగుంది. రాజమౌళి సింప్లి సిటీకి ఇదే ఒక ఉదాహరణ.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular