గురువారం, మార్చి 28, 2024
Homeఅంతర్జాతీయంరాకాసి దోమకాటుకి 400 పశువుల ప్రాణాలు....!

రాకాసి దోమకాటుకి 400 పశువుల ప్రాణాలు….!

ఎక్కడినుంచి వచ్చాయో ఈ రాకాసి దోమలు వందల సంఖ్యలో జంతువుల్ని, వన్య ప్రాణుల్ని పీల్చి ప్రాణం తీస్తున్నాయి. ఈ భయానక ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది కాకపొతే ఆలస్యంగా  వెలుగులోకొచ్చింది. గత నెల ఆగస్టు 27న హరికేన్‌ లారా రావడంతో  పెద్ద ఎత్తున రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చి చేరాయి.

దింతో అక్కడ జంతువుల పరిస్థితి తారుమారైంది. గేదెలు, ఆవులు, జింకలు మరియు పెంపుడు జంతువులపై దాడి చేసి రక్తం పీల్చి చంపేశాయి. దీనివల్ల లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. దీనితో  రంగంలోకి దిగిన సిబ్బంది హెలికాఫ్టర్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు.

మందుల పిచికారీతో  దోమల ఉధృతి కొద్దిగా తగ్గింది కానీ ఈ దోమల కాటుకు గురై  400 పాడి  జంతువులూ, జింకలు ప్రాణాలు వదిలాయి. వీటి ఫోటో ను సెప్టెంబర్‌ 2న ఓ వ్యక్తి తీసాడు ఆ ఫోటో ఒకటి రాకాసి దోమల రక్త దాహానికి అద్దంపడుతోంది. బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన ఎద్దు పొట్ట పై భారీఆంఖ్యలో  చేరిన దోమల గుంపు రక్తం పీలుస్తున్న ఫొటో కెమెరాకు చిక్కింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular