మంగళవారం, మార్చి 19, 2024
Homeజాతీయంఏపీలో భారత వాయుసేన స్థావరాలు ఏర్పాటుకు రంగం సిద్దం

ఏపీలో భారత వాయుసేన స్థావరాలు ఏర్పాటుకు రంగం సిద్దం

పెట్టుబడుల విషయంలో ఆంద్రప్రదేశ్ కు కేంద్రం తీపికబురు చెప్పనుంది రాష్ట్రంలో  వైమానిక స్థావరాల ఏర్పాటుకు భారత వాయుసేన కొన్నాళ్ళుగా కసరత్తు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్లు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఇవి రానున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వానికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొన్నాళ్ళ క్రితం తెగదెంపులు అయిన సందర్భంగా వీటి ఏర్పాటుకు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందా లేదా అనేది తెలియాలి.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన పలు చర్చల్లో ప్రకాశం జిల్లా లోని దొనకొండ ప్రాంతాన్ని భారీ హెలికాప్టర్ శిక్షణా కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఇంకా అనంతపురం జిల్లాలో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని మరియు అమరావతిలో సైబర్ సెక్యూరిటీ కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తోంది.

ఇక  వీటికి సంభందించిన పలు ప్రణాళికలను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించింది. అదేవిధంగా రాజమహేంద్రవరం, విజయవాడ విమానాశ్రయాలను యుద్ధ విమానాలు మరియు ఇతర విమానాల మోహరింపు స్థావరంగా వినియోగించుకోవడానికి ప్రతిపాదించింది.

అయితే కొన్నాళ్ళక్రితం విశాక విమానాశ్రయాన్ని కేంద్రం వారంలో రెండురోజుల పాటు మాత్రమె యుద్ధవిమానాల శిక్షణలో భాగంగా వినియోగించేవారు. దీనితో ఆంద్రప్రదేశ్ ప్రభత్వం మరియు పారిశ్రామిక వేత్తలు దీనిపై మండిపడ్డారు. కేంద్రం కావాలనే ఆంద్రప్రదేశ్ పైఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని ఆంద్రప్రదేశ్ ఖజానాకు పూర్తిగా గండి కొడుతుందని విమర్శించారు.

అయితే తూర్పు తీర ప్రాంతంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్న్నల్లో భాగంగా ప్రస్తుతం ప్రయోగంలో ఉన్న రాజమహేంద్రవరం మరియు విజయవాడల్లోని విమానాశ్రయాలను స్థావరాలుగా వినియోగించుకోవాలని ఐఏఎఫ్ భావిస్తోందని తెలుస్తోంది.

ప్రస్తుతం చెన్నై సమీపంలోని అరక్కోనంలో వైమానికదళ స్థావరం ఒకటి ఉంది. నౌకాదళానికి ఆంధ్రా విశాఖపట్నంలో ఐఎన్ఎస్ డేగ కేంద్రం ఉంది. తూర్పు తీర ప్రాంతానికి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపధ్యంలో ఈ ప్రాంతంలో చైనా వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా కేంద్రం ఆంద్రప్రదేశ్ ను వ్యూహాత్మక కేంద్రాల స్థావరంగా మలుచుకోవాలని భావిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఐఏఎఫ్ ఉన్నతాదికారులు ఇప్పటికే ముఖ్యమంతి చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనపై ఇండియన్ ఎయిర్ ఫోర్సు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని  మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజీజ్ జైన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular