గురువారం, మార్చి 28, 2024
Homeరాజకీయంఆ విషయంలో భారత్ కన్నా పాకిస్థాన్, బంగ్లాదేశ్ చాలా బెటర్ : సిద్దూ

ఆ విషయంలో భారత్ కన్నా పాకిస్థాన్, బంగ్లాదేశ్ చాలా బెటర్ : సిద్దూ

గత కొంత కాలంగా రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ధరలపై మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి సిద్దూ స్పందిస్తూ దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. బారత్ తో పోలిస్తే చిన్న ఆర్ధిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని అన్నారు.

గత కొన్ని వారాలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఇవి జీవిత కాల గరిస్టానికి చేరుకొని కొత్త రికార్డులను నేకోల్పాయని సిద్దూ ఎద్దేవా చేసారు. ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటం భాదాకరమని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై అధిక పన్నులు విధించి ఇంధన కంపెనీలకు లబ్ది చేకూర్చేలా కేంద్రప్రభుత్వం పనిచేస్తుందని ఎద్దేవా చేసారు.

అయితే పెట్రోల్ ధరల విషయానికి వస్తే ముంభై లో లీటర్ పెట్రోల్ ధర రూ.91 దాటింది. పెట్రోల్, డీజిల్ తో పాటు ఇప్పుడు కొత్తగా గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.500 దాటింది. తాజా పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ కొత్త రికార్డు మార్క్ ను చేరుకున్నాయి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular