గురువారం, మార్చి 28, 2024
Homeఅంతర్జాతీయంఅమెరికా లో తెలుగు విద్యార్థుల పరిస్థితి

అమెరికా లో తెలుగు విద్యార్థుల పరిస్థితి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అమెరికా లో విలయ తాండవం సృష్టించింది..అమెరికాలో  కరోనా విచ్చలవిడిగా విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని  కట్టడిచేయ్యడానికి లాక్​డౌన్​ విధించింది  ప్రభుత్వం. యూనివర్సిటీలు సహా అన్నింటిని మూసివేసింది.

ఈ నేపథ్యంలో అక్కడి భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అమెరికాలోని  భారత రాయబార ప్రతినిధి తరణ్​జిత్​ సింగ్​ సంధు వాళ్లలో  500 మంది విద్యార్థులతో ఇన్​స్టాగ్రామ్​లో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కిడివారు అక్కడే ఉండాలని తెలిపారు.

అక్కడి విద్యార్థులు ఎవరూ కంగారుపడొద్దని వాళ్లకు తరుణ్ జిత్ ధైర్యం చెప్పారు. తాము అమెరికా అధికారులతో ఎప్పటికప్పుడు  సంప్రదింపులు జరిపి అక్కడివారికి కావలసిన సాయం అందించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

 దాదాపు అమెరికా లో  2,40,000 మంది భారత విద్యార్థులు ఉన్నారని అంచనా. అయితే ప్రస్తుతం అమెరికా అతలాకుతలమై అక్కడ కరోనా  ఎఫెక్ట్ తో యూనివర్సిటీలు, హాస్టళ్లు మూతపడ్డాయి. అక్కడినుంచి అందరినీ ఇంటికి వెళ్లమని ప్రభుత్వం అదేశించింది.

ఉన్నట్టుండి అమెరికా ప్రభత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో  ఎటువెళ్ళాలో తెలియక వందాలాది మంది విద్యార్థులు  అవస్థలు  పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే అక్కడి పరిస్థితులు చక్కబడ్డాకా  అందరినీ స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని తరణ్​జిత్​ సింగ్ భరోసా ఇచ్చారు.

అమెరికాలో కరోనా కలకలం  మొదలైనప్పటి నుంచి భారత విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్​లైన్​ సెంటర్లను ఏర్పాటు చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. ఇక ప్రస్తుత అమెరికా పరిస్థితి గోరంగా ఉండటంతో అసలు అక్కడ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియక ప్రజలు భయపడుతున్నారు

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular