మంగళవారం, నవంబర్ 28, 2023
Homeరాజకీయంసెంచరీ వైపు ఉరకలు వేస్తున్న పెట్రోల్

సెంచరీ వైపు ఉరకలు వేస్తున్న పెట్రోల్

గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్  ధరలు పరుగులు పెడుతున్నాయి నేడుకూడా ఇంధన ధరలు పెరగడంతో వినియోగ దారుడి గుండెలు మండుతున్నాయి. చమురుధరలు మంగళవారం కూడా మరింత పైకిచేరి ఆర్ధిక రాజధాని ముంబాయిలో 90 మార్క్ దాటిన పెట్రోల్ 100 మార్క్ వైపు ఉరకలు వేస్తూ పరిగెడుతుంది. నేడు 14 పైసలు పెరగడంతో ముంబాయిలో లీటర్ పెట్రోల్ 90.22కు చేరింది. మరో కొద్దిరోజులు ఇలాగే పెరిగితే పెట్రోల్ ధర సెంచరీ కొట్టడం కాయం గా కనిపిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీ లో లీటర్ పెట్రోల్ 82.86 గా ఉండగా హైదరాబాద్ లో 87.84గా ఉంది. గత కొన్ని వారాలుగా దేశంలో ఇంధన ధరలు ఆకాసాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ౦గా ముడిచమురు పెరగటం మరియు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ బారీగా పతనమవ్వడం, చమురు రవాణాపై అధిక ఎక్సైజ్ సుంకం, కేంద్రంకూడా పెట్రోల్ ధర పై నియంత్రణ ఎత్తివేత, మొదలగు కారణాలతో పేద మరియు మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం పడుతుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular