సాంప్రదాయబద్ధంగా జగన్మోహిణీ కళ్యాణం.

0
316
ryali jagan mohini temple
ryali jagan mohini temple

అత్యంత విశేషమైన మూలవిరాట్టును కలిగి, ప్రపంచంలలోనే అరుదైన ఆలయంగా విఖ్యాతి గాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న  శ్రీ జగన్మోహినీ కేశవ స్వామివారి కళ్యాణ మహోత్సవం చడీచప్పుడూ లేనివిధంగా చరిత్రలో మొదటిసారి జరిగింది.

కరోనా వైరస్ కారణంగా  ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి, ఆగమన శాస్త్రం ప్రకారం అర్చకులచే భక్తులెవరూ రాకుండానే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ స్వామివారి కళ్యాణాన్ని రహస్యంగా జరిపించామని ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.క్రష్ణచైతన్య చెప్పారు.

తన చేతులమీదుగా ఈ విధంగా ఈ కళ్యాణం జరిపించవలసి వుంటుదనీ తాము ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.  అలాగే ఈ సంవత్సరం  శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని సాధారణ పూజలు మినహా గురువారం ఆలయంలో ఎటువంటి సాంప్రదాయక కార్యక్రమాలూ జరగలేదని ఆవేదన కలిగిందంటూ స్వామిదయ కలిగి భారతదేశం తిరిగి తన వెలుగుల వైభవాన్ని ప్రసరించాలని ఈ కష్టం తొలగిపోవాలనీ ఆకాంక్షతో  ప్రతీ ఆలయంలోనూ పూజారులంతా పూజలు నిర్వహించాలని కోరారు.