Saturday, July 4, 2020
Home భక్తి వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యత.....

వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యత…..

శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని పురాణాలు చెబుతాయి శ్రావణ నక్షత్రంలో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం గనుక శ్రావణ మాసం గా పిలవబడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం, మంగళవారం, శుక్రవారం పౌర్ణములు  చాల విశిష్టమైనవి.lakshmi devi

శ్రావణ మాసం లో వచ్చే సోమవారం నాడు చేసే శివారాదన కోరిన కోర్కెలను తీర్చే  అద్భుతమైన రోజుగా మహర్షులు చెబుతారు. ఆరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివారాదన చేస్తాడట. అందువలన ఈ రోజున భక్తితో పూజించిన వారికి శివానుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లబిస్తుందని అంటారు. అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ ‘శ్రావణ మంగళవారం’ నోము నోచుకోవడం పూర్వం నుండీ వస్తున్న ఆచారం.

శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు మరియు వెంకటేశ్వరస్వామిది ‘శ్రవణానక్షత్రం’ అందువలన ఈ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమని పండితులు చెబుతారు. ఈ శ్రావణ మాసం అంతా అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించినట్లయితే సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం.

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీవ్రతం జరుపుకుంటారు ఈ వ్రతం జరుగుతున్న ప్రదేశాలకు లక్ష్మీదేవి నేరుగా వస్తుందని బక్తులలో ఓక నమ్మకం ఉంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక విశిష్టత ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ‘రక్షాబందన్’ జరుపుకుంటారు.lakshmi devi

తరాలు మారుతున్న  శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలామంది ఇళ్లలో కొత్త పెళ్లి కూతుళ్లతో నోములు చేయిస్తుంటారు అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని ఏ ఇంట్లో కంటతడి పెట్టకుండా చుసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై వుంటుందని అభిప్రాయం ఉంది. మన పూర్వికులు మనకు చెప్పిన సంప్రదాయాలలోనూ ఎన్నో ఆరోగ్య సూత్రాలు మరియు మనుషుల జీవన విలువలు సలిగిన నేపధ్యంలో వీటిని ఆచరించడం వల్ల మానసిక వత్తిడి దూరమై అన్ని పనులలోనూ విజయాన్ని పొందగలుగుతారు.

ప్రజావారధిhttps://www.prajavaradhi.com/
పాటకులకు ముఖ్య్యంగా తెలుగు ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉండాలని రూపొందించిన వెబ్ సైట్ ప్రజావారధి డాట్ కాం. గత కొంతకాలంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఘణనీయంగా తగ్గిపోతుంది కావున మళ్ళీ తెలుగుకు పూర్వవైభవం రావాలనే ఆశతో మా ఈ చిన్న ప్రయత్నం. ఇందులో తెలుగు ప్రజలకు ఉపయోగపడే ముఖ్య సమాచారంతో పాటు రాజకీయ వార్తలు, దేశ, విదేశీ వార్తలు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతీ మనిషికీ ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే హెల్త్ టిప్స్ మరియు క్రీడావార్తలు అన్నివయస్సుల వారికీ ఉపయోగపడే భక్తి సమాచారం ఈ వెబ్ సైట్ మీకు అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

జగన్నాథ రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్-Puri Jagannath Rath Yatra

ఒడిశాలోని జరిగే పురి జగన్నాథుని రథయాత్ర కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొన్ని రోజుల క్రితం ఆలయ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు కొన్ని నిబంధనలతో రథయాత్ర జరుపుకోవచ్చని...

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన...

కరోనా తో మరణించిన వ్యక్తిని జేసీబీ లో తీసుకెళ్ళిన ఘటన

కరోనా మహమ్మారి దెబ్బకు కరోనా సోకిన వారిని వారు బంధువులైనా మరెవరైనా సరే వారిని దూరం పెట్టిన ఘటనలు చాలానే చూసాం. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే...

కాపు రిజర్వేషన్ ను పక్కదోవ పట్టించడానికే ఈ కాపు నేస్తం…పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కాపు నేస్తం పథకం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ గురించి...

Recent Comments